Share News

మన్యంలో భారీ వడగళ్ల వర్షం

ABN , Publish Date - Mar 31 , 2026 | 12:31 AM

మన్యంలో సోమవారం వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. వాతావరణంలో మార్పుల కారణంగా కొన్ని రోజులుగా గిరిజన ప్రాంతంలో విభిన్న వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సోమవారం కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎండకాసింది.

మన్యంలో భారీ వడగళ్ల వర్షం
హుకుంపేట మండలం చినబూరుగుపుట్టులో పడిన వడగళ్లు

జన జీవనానికి అంతరాయం

పాడేరు, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): మన్యంలో సోమవారం వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. వాతావరణంలో మార్పుల కారణంగా కొన్ని రోజులుగా గిరిజన ప్రాంతంలో విభిన్న వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సోమవారం కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎండకాసింది. ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ప్రధానంగా మండల కేంద్రాల్లో కాకుండా రూరల్‌ ప్రాంతాల్లో భారీ స్థాయిలో మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి వడగళ్ల వర్షం కొనసాగింది. పెదబయలు, ముంచంగిపుట్టు, హుకుంపేట ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన భారీ వర్షం కురవగా, ఇతర ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. భారీ వర్షం వలన జన జీవనానికి తీవ్ర అంతరాయం కలిగింది.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

వర్షాలు కురుస్తున్నప్పటికీ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సోమవారం అరకులోయలో 17.5, పెదబయలులో 17.6, చింతపల్లిలో 19.1, జి.మాడుగులలో 20.9, అనంతగిరిలో 22.6, కొయ్యూరులో 22.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Mar 31 , 2026 | 12:31 AM