Share News

గుడ్డుకు గడ్డు కాలం

ABN , Publish Date - Mar 14 , 2026 | 11:21 PM

పశ్బిమ ఆసియాలో యుద్ధ ప్రభావం పౌలీ్ట్ర పరిశ్రమపై పడింది. సౌదీ అరేబియాకి గుడ్లు ఎగుమతులు నిలిచిపోవడంతో కోడి గుడ్డు ధర పడిపోయింది.

 గుడ్డుకు గడ్డు కాలం
కోడిగుడ్లు

పశ్చిమ ఆసియాలో యుద్ధ ప్రభావంతో ఆగిన ఎగుమతులు

హోల్‌సేల్‌ మార్కెట్లో రూ.5 నుంచి రూ.4లకు పడిపోయిన ధర

నర్సీపట్నం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): పశ్బిమ ఆసియాలో యుద్ధ ప్రభావం పౌలీ్ట్ర పరిశ్రమపై పడింది. సౌదీ అరేబియాకి గుడ్లు ఎగుమతులు నిలిచిపోవడంతో కోడి గుడ్డు ధర పడిపోయింది. యుద్ధం వలన ఆగిన ఎగుమతులు, రంజాన్‌ మాసం కారణంగా తగ్గిన వినియోగంతో ఒకేసారి రూ.5 నుంచి రూ.4లకు ధర పడిపోవడంతో పౌలీ్ట్ర నిర్వాహకులు కుదేలయ్యారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పరిధిలో 45 లక్షల కోళ్లు ఉన్నాయి. ప్రతి రోజూ 35 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతుంటాయి. స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలకు, వసతి గృహాలు, హోటళ్లు, స్థానికంగా వినియోగానికి ఈ గుడ్లు సరిపోతాయి. అయితే యుద్ధం మొదలైన తరువాత అరబ్‌ దేశాలకు ఎగుమతులు ఆగిపోవడంతో గుడ్డు ధర నేల చూపులు చూస్తోంది. దీంతో ఉమ్మడి ఉత్తరాంధ్ర పౌలీ్ట్ర పరిశ్రమ తీవ్ర నష్టాలను చవి చూస్తున్నది. గుడ్లు ఎగుమతులు మొదలవ్వకపోతే రానున్న రోజుల్లో మరింత నష్టాలు చవిచూడాల్సి వస్తుందని పౌలీ్ట్ర యూనియన్‌ అధ్యక్షుడు శ్రీధర్‌ తెలిపారు.

జనవరిలో గుడ్డు ధర రూ.7.20

జనవరి మొదటి వారంలో గుడ్డు ధర రూ.7.20 వరకు ఎగబాకింది. 30 గుడ్లు క్రేట్‌ ధర రూ.210 నుంచి రూ.220 వరకు ఉండేది. జనవరి రెండో వారం తరువాత రోజు రోజుకి ఽగుడ్డు ధర పతనమవుతూ వచ్చింది. రూ.180లకు పడి పోయినప్పుడు విడిగా గుడ్డు రూ.6లకు విక్రయించేవారు. శనివారం రిటైల్‌ మార్కెట్‌లో ఽక్రేట్‌ గుడ్లు రూ.130లకు విక్రయిస్తున్నారు. దుకాణాల వద్ద విడిగా రూ.5లకు అమ్ముతున్నారు.

Updated Date - Mar 14 , 2026 | 11:21 PM