ఘనంగా మహిళా దినోత్సవం
ABN , Publish Date - Mar 08 , 2026 | 11:35 PM
పాడేరులోని ఎస్‌ఆర్ శంకరన్ ఆడిటోరియంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
పలువురికి సన్మానం
పాడేరురూరల్, మార్చి 8(ఆంధ్రజ్యోతి): పాడేరులోని ఎస్‌ఆర్ శంకరన్ ఆడిటోరియంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్ దినేశ్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఇంటికి వెలుగు అని, ప్రతీ కుటుంబ విజయం వెనుక స్త్రీ శక్తి దాగి ఉంటుందని కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ మహిళలకు సమాజంలో సరైన గుర్తింపు, ఆత్మగౌరవం కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మహిళకు ఆత్మగౌరవం పెరిగినప్పుడు ప్రతీ రంగంలో రాణిస్తారన్నారు. అనంతరం పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళా అధికారులు, సిబ్బందిని కలెక్టర్ దినేశ్‌కుమార్ సత్కరించి జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమంలో బాలికల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎస్పీ అమిత్‌బర్దార్, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్, రాష్ట్ర జానపద కళలు, సాంస్కృతిక, సృజనాత్మక అకాడమీ చైర్మన్ వంపూరు గంగులయ్య, జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, ట్రైకార్ డైరెక్టర్ కె.కృష్ణారావు, ఎంపీపీ ఎస్.రత్నాలమ్మ, జడ్పీటీసీ సభ్యురాలు కె.గాయిత్రిదేవి, టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి బొర్రా విజయరాణి, ప్రభుత్వ మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డి.హేమలతాదేవి, డీఆర్‌డీఏ పీడీ వి.మురళి, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయి, టీడబ్ల్యూ డీడీ పీబీకే పరిమళ, ఐటీడీఏ ఏవో హేమలత, జిల్లా ఉన్నతాధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.