Share News

ప్రతి గడపలో సంతోషమే లక్ష్యం

ABN , Publish Date - Aug 21 , 2026 | 10:26 PM

ప్రతి గడపలో సంతోషమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన అందిస్తున్నదని జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌ అన్నారు.

ప్రతి గడపలో సంతోషమే లక్ష్యం
మారుమూల దాయర్తి గ్రామంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలోని జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌, టీడీపీ నాయకులు

జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌

పలు గ్రామాల్లో ఇంటింటికి టీడీపీ నిర్వహణ

అనంతగిరి, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ప్రతి గడపలో సంతోషమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన అందిస్తున్నదని జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని మారుమూల జీనబాడు, పినకోట పంచాయతీల్లో దాయర్తి, గుమ్మంతి, వాజంగి, వెలగలపాడు, కొరాపర్తి, దిబ్బపాలెం, జీనబాడు, పెదగంగవరం గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత దాయర్తి గ్రామంలో కిడారి శ్రావణ్‌కుమార్‌, టీడీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి గిరిజనులతో మమేకమయ్యారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పాఠశాల, అంగన్‌వాడీ, రహదారి సౌకర్యం కల్పించాలని గిరిజనులు కోరారు. దీంతో అక్కడి నుంచే సంబంధిత అధికారులతో శ్రావణ్‌కుమార్‌ ఫోన్లో మాట్లాడారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా జీసీసీ చైర్మన్‌ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి తరుపున నిలబడే అభ్యర్థులకు ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి గాలి నరేంద్ర, మాజీ మండల అధ్యక్షుడు బుజ్జిబాబు, టీడీపీ యూత్‌ ప్రెసిడెంట్‌ డి.శ్యామ్‌, మహిళ అధ్యక్షురాలు పి.నిర్మల, నాయకులు బిడ్డ లక్ష్మణరావు, జే దేముడు, గ్రామ కమిటీ అధ్యక్షుడు గండి సురేశ్‌, ఎం.శ్యామ్‌, నూకరాజు, సుందరరావు, జె.సురేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2026 | 10:26 PM