తల్లుల కళ్లల్లో ఆనందం
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:53 AM
కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడంతో వాటిని తీసుకునేందుకు గురువారం బ్యాంకుల వద్దకు తల్లులు వచ్చారు. గూడెంకొత్తవీధి పంచాయతీ పీకే గూడెం గ్రామానికి చెందిన పాలిక సింగారి తన ఐదుగురు పిల్లలకు సంబంధించి తల్లికి వందనం నగదు రూ.65 వేలు తీసుకుంది.
- తల్లికి వందనం నగదు అందుకుని సంతోషం
- సీఎం చంద్రబాబుకు రుణపడి ఉంటామని వెల్లడి
గూడెంకొత్తవీధి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడంతో వాటిని తీసుకునేందుకు గురువారం బ్యాంకుల వద్దకు తల్లులు వచ్చారు. గూడెంకొత్తవీధి పంచాయతీ పీకే గూడెం గ్రామానికి చెందిన పాలిక సింగారి తన ఐదుగురు పిల్లలకు సంబంధించి తల్లికి వందనం నగదు రూ.65 వేలు తీసుకుంది. ఇద్దరు పిల్లలు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతుండగా, మరో ముగ్గురు ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నారు. అలాగే కొత్తపల్లి గ్రామానికి చెందిన వంతల జమ్మి నలుగురు పిల్లలకు సంబంధించి రూ.52 వేల నగదును బ్యాంక్ నుంచి విత్‌డ్రా చేసుకుంది. దీంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. సందర్భంగా వారు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్న సీఎం చంద్రబాబునాయుడుకు రుణపడి ఉంటామ న్నారు. ఈ నగదుతో పిల్లలకు దుస్తులు, ఇతర సామగ్రి కొనుగోలు చేస్తామన్నారు.