మాతృ సంస్థకు జీవీఎంసీ జడ్సీ
ABN , Publish Date - May 10 , 2026 | 12:44 AM
మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) అనకాపల్లి జోనల్ కమిషనర్ కె.చక్రవర్తి మాతృ శాఖకు బదిలీ అయ్యారు.
వ్యవసాయ శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి
అనకాపల్లి టౌన్, మే 9 (ఆంధ్రజ్యోతి): మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) అనకాపల్లి జోనల్ కమిషనర్ కె.చక్రవర్తి మాతృ శాఖకు బదిలీ అయ్యారు. వ్యవసాయ శాఖ నుంచి పురపాలక శాఖకు డిప్యూటేషన్‌పై వచ్చిన ఆయనకు ఇటీవల మాతృశాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి లభించడంతో తిరిగి సొంత శాఖకు వెళ్లారు. ఆయనను నంద్యాల జిల్లా బనగానపల్లికి ప్రభుత్వం బదిలీ చేసినట్టు తెలిసింది. ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ, ఈ పది నెలలపాటు ఇక్కడ జడ్సీగా విధులు నిర్వహించడం సంతృప్తినిచ్చిందన్నారు. కలెక్టర్ చేతుల మీదుగా రిపబ్లిక్ డే రోజున ప్రశంసాపత్రం అందుకోవడం గర్వంగా ఉందన్నారు.