Share News

మహా ఘోరం

ABN , Publish Date - Jul 07 , 2026 | 01:18 AM

దక్షిణ నియోజకవర్గం పరిధిలోని వన్‌టౌన్‌ ప్రాంతంలో పారిశుధ్యం ఘోరంగా ఉంది. డ్రైనేజీలన్నీ పూడికతో నిండిపోయాయి.

మహా ఘోరం

మహా ఘోరం

వన్‌టౌన్‌లో క్షీణించిన పారిశుధ్యం

డ్రైనేజీల్లో పేరుకుపోయిన పూడిక

రోడ్లపై ప్రవహిస్తున్న మురుగు

విశాఖపట్నం, జూలై 6 (ఆంధ్రజ్యోతి):

దక్షిణ నియోజకవర్గం పరిధిలోని వన్‌టౌన్‌ ప్రాంతంలో పారిశుధ్యం ఘోరంగా ఉంది. డ్రైనేజీలన్నీ పూడికతో నిండిపోయాయి. దీంతో మురుగునీరు రోడ్ల పైనుంచి ప్రవహిస్తోంది. ఆయా ప్రాంతాలన్నీ తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్నాయి. నగరంలో ప్రముఖులు, పర్యాటకులు ఎక్కువగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణపైనే జీవీఎంసీ సిబ్బంది దృష్టిపెడుతుంటారు. వన్‌టౌన్‌ ప్రాంతంలో ప్రముఖుల పర్యటనలు ఉండవు. అందుకే పారిశుధ్య నిర్వహణ పట్ల సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. పూడికతీత సక్రమంగా జరగకపోవడంతో మురుగునీరు రోడ్ల పైనుంచి ప్రవహిస్తోంది. ఇప్పటికైనా అధికారులు వన్‌టౌన్‌ ప్రాంతంలో పారిశుధ్యంపై దృష్టిసారించాలని స్థానికులు కోరుతున్నారు.


నేడు భోగాపురానికి కీలక అధికారి రాక

విశాఖపట్నం, జూలై 6 (ఆంధ్రజ్యోతి):

భోగాపురం అంతరాత్జీయ విమానాశ్రయానికి మంగళవారం కేంద్ర పౌర విమానయాన శాఖ సెక్రటరీ సమీర్‌కుమార్‌ సిన్హా వస్తున్నారు. ఆయన ప్రత్యేక విమానంలో నేరుగా భోగాపురంలో విమానాశ్రయంలోనే ఉదయం 7.30 గంటలకు దిగుతారు. అక్కడ కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. అది ముగిసిన తరువాత కేంద్ర మంత్రితో కలిసి అదే విమానంలో మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీకి బయలుదేరి వెళతారు. భోగాపురం విమానాశ్రయం త్వరలో ప్రారంభించనున్న నేపథ్యంలో ఆయన రాక ప్రాధాన్యం సంతరించుకుంది.


5వ రోజుకు చేరిన క్యాబ్‌ డ్రైవర్ల సమ్మె

విశాఖపట్నం, జూలై 6 (ఆంధ్రజ్యోతి):

ఓలా, ఊబర్‌, ర్యాపిడో సంస్థలు చార్జీలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ క్యాబ్‌ డ్రైవర్లు చేస్తున్న సమ్మె సోమవారం ఐదో రోజుకు చేరింది. వీరంతా విమానాశ్రయం వద్ద ప్రైవేటు ట్యాక్సీలను అడ్డుకోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వీరి డిమాండ్లను తీర్చడానికి రెండు సంస్థలు అంగీకరించినా, మూడో సంస్థ చర్చలకు రాకపోవడంతో ఆందోళన కొనసాగిస్తున్నారు.

Updated Date - Jul 07 , 2026 | 01:18 AM