Share News

నక్కపల్లిలో స్టీల్‌ప్లాంట్‌కు 23న భూమి పూజ

ABN , Publish Date - Mar 07 , 2026 | 12:50 AM

నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేయనున్న ఆర్సెలార్‌ మిట్టల్‌- నిప్పన్‌ స్టీల్‌ ప్లాంట్‌కు ఈ నెల 23వ తేదీన భూమిపూజ జరగనుంది. ఈ విషయాన్ని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మీడియాకు వెల్లడించారు.

నక్కపల్లిలో స్టీల్‌ప్లాంట్‌కు 23న భూమి పూజ

అనకాపల్లి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేయనున్న ఆర్సెలార్‌ మిట్టల్‌- నిప్పన్‌ స్టీల్‌ ప్లాంట్‌కు ఈ నెల 23వ తేదీన భూమిపూజ జరగనుంది. ఈ విషయాన్ని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మీడియాకు వెల్లడించారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రతినిధులు ఇటీవల నక్కపల్లి మండలంలో పర్యటించి భూములను, మౌలిక వసతుల పనులను పరిశీలించారు. తరువాత అనకాపల్లి వచ్చి కలెక్టర్‌ విజయకృష్ణన్‌, జేసీ శౌర్యమాన్‌తో భేటీ అయ్యారు. రెండు దశల్లో నిర్మించే స్టీల్‌ ప్లాంట్‌ తొలి దశ పనులను సుమారు రూ.80 వేల కోట్ల పెట్టుబడులతో 2029 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా స్టీల్‌ ప్లాంట్‌ భూమిపూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబునాయుడు హాజరవుతారని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు.

Updated Date - Mar 07 , 2026 | 12:50 AM