వీఎంఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్‌కు గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Jul 09 , 2026 | 01:12 AM
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) తయారుచేసిన మాస్టర్ ప్లాన్-2041ను ఆమోదిస్తూ దానిని అమలులోకి తీసుకువస్తున్నట్టు పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ బుధవారం జీఓ జారీచేసింది. వాస్తవానికి ఈ మాస్టర్ ప్లాన్ వైసీపీ హయాంలోనే తయారైంది.
జీఓ విడుదల
విశాఖపట్నం, జూలై 8 (ఆంధ్రజ్యోతి):
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) తయారుచేసిన మాస్టర్ ప్లాన్-2041ను ఆమోదిస్తూ దానిని అమలులోకి తీసుకువస్తున్నట్టు పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ బుధవారం జీఓ జారీచేసింది. వాస్తవానికి ఈ మాస్టర్ ప్లాన్ వైసీపీ హయాంలోనే తయారైంది. ఆ పార్టీ నాయకులకు లబ్ధి కలిగే విధంగా రూపొందించారని ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం వచ్చాక దానిపై అభ్యంతరాలు ఆహ్వానించింది. దఫదఫాలుగా జరిగిన ఈ ప్రక్రియలో ఆమోదించదగిన అభ్యంతరాలను స్వీకరించి, మిగిలిన వాటిని పక్కన పెట్టి కొత్త మాస్టర్‌ప్లాన్ తయారు చేశారు. దీనిని కూడా ప్రజలకు అందుబాటులో ఉంచి అభ్యంతరాలు స్వీకరించి, తుది ఆమోదముద్ర వేశారు. ఈ ప్రక్రియలో కొత్తగా కేంద్రం నీతి ఆయోగ్ ద్వారా ప్రతిపాదించిన విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్‌ను కూడా మాస్టర్ ప్లాన్‌లో చేర్చారు. దానిని దృష్టిలో ఉంచుకొని ఏ ప్రాంతంలో ఏ విధమైన అభివృద్ధి చేయాలో నిర్ణయించారు.