కేంద్రీయ విద్యాలయానికి గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Feb 28 , 2026 | 12:39 AM
అనకాపల్లికి దశాబ్ద కాలం క్రితం మంజూరైన కేంద్రీయ విద్యాలయం ఎట్టకేలకు ఈ ఏడాది ప్రారంభం కానున్నది. సొంత భవనాలు నిర్మించే వరకు తాత్కాలికంగా పట్ణంలోని ఉడ్‌పేటలో జీవీఎంసీ ప్రాథమిక పాఠశాల ఆవరణలో తరగతులు నిర్వహిస్తారు.
ఉడ్‌పేట ప్రైమరీ స్కూల్‌లో తాత్కాలిక వసతి
ఈ ఏడాది ఒకటి నుంచి 5వ తరగతి వరకు ప్రవేశాలు
కొత్తూరు, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లికి దశాబ్ద కాలం క్రితం మంజూరైన కేంద్రీయ విద్యాలయం ఎట్టకేలకు ఈ ఏడాది ప్రారంభం కానున్నది. సొంత భవనాలు నిర్మించే వరకు తాత్కాలికంగా పట్ణంలోని ఉడ్‌పేటలో జీవీఎంసీ ప్రాథమిక పాఠశాల ఆవరణలో తరగతులు నిర్వహిస్తారు. రానున్న విద్యా సంవత్సరం (2026-27)లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రవేశాలు కల్పిస్తారు. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది.