Share News

ఎస్‌టీ నాయక్‌ కుల ధ్రువీకరణ పత్రాల జారీకి గ్రీన్‌ సిగ్నల్‌

ABN , Publish Date - Jun 01 , 2026 | 11:34 PM

జిల్లాలో ఎన్‌టీ నాయక్‌లకు కుల ధ్రువీకరణ పత్రాల జారీకి అవకాశం కల్పిస్తున్నామని జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ తెలిపారు.

ఎస్‌టీ నాయక్‌ కుల ధ్రువీకరణ పత్రాల జారీకి  గ్రీన్‌ సిగ్నల్‌
జేసీ శ్రీపూజ

జేసీ తిరుమాని శ్రీపూజ

పాడేరు, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎన్‌టీ నాయక్‌లకు కుల ధ్రువీకరణ పత్రాల జారీకి అవకాఽశం కల్పిస్తున్నామని జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 8,883 ఎస్‌టీ నాయక్‌ తెగకు చెందిన గిరిజన కుటుంబాలున్నాయని, వారికి ఎస్‌టీ ధ్రువీకరణ పత్రాలు లేవని గుర్తించామన్నారు. ఈ క్రమంలో వారికి మొదటి విడత జూన్‌లో, రెండో విడత జూలైలో కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తామన్నారు. ఆయా తెగలకు చెందిన వారంతా తమ వద్ద ఉన్న ఆధారాలతో తమ పరిధిలోని సచివాలయంలో కుల ధ్రువీకరణకు దరఖాస్తులు చేసుకోవాలని జేసీ సూచించారు. ఽకుల ధ్రువీకరణకు సమర్పించిన దరఖాస్తులు అన్ని స్థాయిల్లో పరిశీలన జరిపి ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తామని సోమవారం ఒక ప్రకటనలో ఆమె తెలిపారు.

Updated Date - Jun 01 , 2026 | 11:34 PM