Share News

మహా సంబరం

ABN , Publish Date - May 28 , 2026 | 11:20 PM

తెలుగుదేశం పార్టీ రెండు రోజుల మహానాడు వేడుకలు గురువారం కూడా ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని ప్రతి మండల కేంద్రంలోనూ పండుగ వాతావరణంలో మహానాడు వేడుకల్లో పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.

మహా సంబరం
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మహానాడులో పాల్గొన్న పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నారా లోకేశ్‌, అల్లూరి జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి, మంత్రి నిమ్మల రామానాయుడు

పాడేరు, అరకులోయ, చింతపల్లితో సహా ప్రతి మండల కేంద్రంలో మహానాడు సందడి

మంగళగిరిలో జరిగిన మహానాడును ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించిన పార్టీ శ్రేణులు

పాడేరు, మే 28(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ రెండు రోజుల మహానాడు వేడుకలు గురువారం కూడా ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని ప్రతి మండల కేంద్రంలోనూ పండుగ వాతావరణంలో మహానాడు వేడుకల్లో పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. కలెక్టరేట్‌కు సమీపంలోని ఎన్‌ఆర్‌ శంకరన్‌ హాలులో టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ పరిశీలకురాలు కొణతాల రత్నకుమారి, టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలుపర్తి గోవిందరావు, జీసీసీ డైరెక్టర్‌ బొర్రా నాగరాజు, టూరిజం డైరెక్టర్‌ కిల్లు రమేశ్‌నాయుడు, పీఏసీఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జి డప్పోడి వెంకటరమణ, వైస్‌ ఎంపీపీ గంగపూజారి శివకుమార్‌, ఐటీడీపీ ఇన్‌చార్జి బుద్ద జ్యోతికిరణ్‌, నియోజకవర్గంలోని ముఖ్య నేతలు, కార్యకర్తలు అభిమానులు హాజరయ్యారు. అరకులోయలో పార్టీ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, ఆర్‌టీసీ విజయనగరం జోన్‌ చైర్మన్‌ దొన్నుదొర ఆధ్వర్యంలో రెండు రోజుల మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. చింతపల్లి కేంద్రంలో టీడీపీ పార్లమెంట్‌ ఉపాధ్యక్షురాలు, సింహాచలం దేవస్థానం బోర్డు సభ్యురాలు చల్లంగి జ్ఞానేశ్వరి, సీనియర్‌ నేతలు చల్లంగి లక్ష్మణరావు, కిల్లో పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో నిర్వహించగా, జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోనూ మండల స్థాయి నేతలు, కార్యకర్తలు మహానాడును ఘనంగా జరుపుకున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మహానాడు కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.

Updated Date - May 28 , 2026 | 11:20 PM