Share News

డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం

ABN , Publish Date - Mar 15 , 2026 | 12:56 AM

అల్లూరి జిల్లా పర్యటన నిమిత్తం శనివారం ఉదయం తొమ్మిది గంటలకు విశాఖ చేరుకున్న జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌ కల్యాణ్‌కు విమానాశ్రయంలో ఎమ్మెల్యేలు పంచకర్ల రమేశ్‌బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.

డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం

గోపాలపట్నం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి):

అల్లూరి జిల్లా పర్యటన నిమిత్తం శనివారం ఉదయం తొమ్మిది గంటలకు విశాఖ చేరుకున్న జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌ కల్యాణ్‌కు విమానాశ్రయంలో ఎమ్మెల్యేలు పంచకర్ల రమేశ్‌బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఆయన విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో పాడేరు వెళ్లారు. నందిగరువు గ్రామానికి కాలినడకన వెళ్లి ఆదివాసీలతో సమావేశమయ్యారు. అనంతరం తిరిగి మధ్యాహ్నం 3.50 గంటలకు విశాఖ చేరుకున్నారు. సాయంత్రం 4.10 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు. పార్టీనేతలు, కార్యకర్తలు ఆయనకు ఆత్మీయ వీడ్కోలు పలికారు.

Updated Date - Mar 15 , 2026 | 12:56 AM