Share News

ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

ABN , Publish Date - Nov 12 , 2026 | 01:31 AM

రెండు రోజులపాటు జరగనున్న పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం సాయంత్రం హెలికాప్టర్‌లో నగరానికి చేరుకున్నారు. ఆయనకు కోస్టల్‌ బ్యాటరీ సమీపానున్న హెలీపాడ్‌ వద్ద జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, ఎంపీ ఎం.శ్రీభరత్‌, నగర మేయర్‌ ముక్కా శ్రావణి, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు, రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌, కలెక్టర్‌ ఎన్‌.అభిషిక్త్‌ కిశోర్‌, రేంజ్‌ ఐజీ గోపీనాథ్‌ జెట్టీ స్వాగతం పలికారు.

ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

విశాఖపట్నం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి):

రెండు రోజులపాటు జరగనున్న పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం సాయంత్రం హెలికాప్టర్‌లో నగరానికి చేరుకున్నారు. ఆయనకు కోస్టల్‌ బ్యాటరీ సమీపానున్న హెలీపాడ్‌ వద్ద జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, ఎంపీ ఎం.శ్రీభరత్‌, నగర మేయర్‌ ముక్కా శ్రావణి, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు, రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌, కలెక్టర్‌ ఎన్‌.అభిషిక్త్‌ కిశోర్‌, రేంజ్‌ ఐజీ గోపీనాథ్‌ జెట్టీ స్వాగతం పలికారు.

అతిథులకు సీఎం విందు

విశాఖపట్నం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): పెట్టుబడుల సదస్సుకు వచ్చిన దేశ,విదేశీ మంత్రులు, పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం రాత్రి నగరంలోని పార్కు హోటల్‌లో విందు ఇచ్చారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. విందుకు వచ్చిన ప్రముఖులందరినీ సీఎం ప్రత్యేకించి పలకరించి వారితో ముచ్చటించారు. దక్షిణాఫ్రికా దేశ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌ ఈ విందుకు హాజరుకాగా ఆయనతో పలువురు ఫొటోలు దిగారు.

Updated Date - Nov 12 , 2026 | 01:31 AM