Share News

మంత్రి లోకేశ్‌కు ఘన స్వాగతం

ABN , Publish Date - Jun 30 , 2026 | 01:34 AM

గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్‌ సోమవారం రాత్రి నగరానికి చేరుకున్నారు.

మంత్రి లోకేశ్‌కు ఘన స్వాగతం

విశాఖపట్నం, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి):

గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్‌ సోమవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ఆయనకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖ జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, హోం మంత్రి వంగలపూడి అనిత, ఎంపీ ఎం.శ్రీభరత్‌, రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్‌, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, సుందరపు విజయకుమార్‌, సుజన రంగారావు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌, విశాఖపట్నం, అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గాల పార్టీ అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్‌, బత్తుల తాతయ్యబాబు, పార్టీ నాయకులు దాడి వీరభద్రరావు, సీతంరాజు సుధాకర్‌, కోరాడ రాజబాబు, కిమిడి నాగార్జున, పీలా శ్రీనివాస్‌, కిడారి శ్రావణ్‌కుమార్‌, మళ్ల సురేంద్ర, దువ్వారపు రామారావు, పీవీజీ కుమార్‌, గిడ్డి ఈశ్వరి, ప్రగడ నాగేశ్వరరావు, దాడి రత్నాకర్‌, బండారు అప్పలనాయుడు, తదితరులు స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టులో పలువురు అర్జీలు అందజేశారు. అనంతరం మంత్రి పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. అక్కడ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురి నుంచి వినతులు స్వీకరించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాత్రికి పార్టీ కార్యాలయంలో బస చేశారు. మంగళవారం ఉదయం కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కలిసి భోగాపురంలో ఏపీ మోడల్‌ పాఠశాలను సందర్శిస్తారు. మధ్యాహ్నం నోవాటెల్‌ హోటల్‌లో జరగనున్న గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో లోకేశ్‌ పాల్గొంటారు.

Updated Date - Jun 30 , 2026 | 01:34 AM