Share News

గీతాశ్రీకి ఘనస్వాగతం

ABN , Publish Date - Jun 15 , 2026 | 12:22 AM

ఇటీవల జపాన్‌లో జరిగిన అండర్‌ -18 ఆసియా కప్‌ హాకీ పోటీల్లో ఇండియా మహిళల జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. జట్టులో ఒకరైన నక్కపల్లికి చెందిన క్రీడాకారిణి నమ్మి గీతాశ్రీ ఆదివారం స్వగ్రామానికి చేరుకుంది.

గీతాశ్రీకి ఘనస్వాగతం
ఊరేగింపులో జాతీయ పతాకాన్ని చేతబూనిన గీతాశ్రీ

ఆసియా కప్‌ హాకీ టోర్నమెంట్‌లో ఆడిన క్రీడాకారిణి

భారత్‌ జట్టుకు కాంస్య పతకం

నక్కపల్లి, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): ఇటీవల జపాన్‌లో జరిగిన అండర్‌ -18 ఆసియా కప్‌ హాకీ పోటీల్లో ఇండియా మహిళల జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. జట్టులో ఒకరైన నక్కపల్లికి చెందిన క్రీడాకారిణి నమ్మి గీతాశ్రీ ఆదివారం స్వగ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆమెకు బీఎస్‌ హాకీ క్లబ్‌ క్రీడాకారులు ఘనస్వాగతం పలికారు. అడ్డరోడ్డు హైవే జంక్షన్‌ నుంచి నక్కపల్లి హైస్కూల్‌ హాకీ మైదానం వరకు త్రివర్ణ పతాకాలను చేతబట్టి జయహో గీతాశ్రీ అంటూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సాయంత్రం హాకీ మైదానంలో టీడీపీ నియోజకవర్గం కన్వీనర్‌ కొప్పిశెట్టి వెంకటేశ్‌, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ, హాకీ క్లబ్‌ వ్యవస్థాపకులు బలిరెడ్డి సూరిబాబు, అధ్యక్షుడు చిన్నఅప్పారావు, కార్యదర్శి తాతాజీ, కోచ్‌లు రాంబాబు, రంజిత్‌, నానాజీ, తదితరులు గీతాశ్రీని ఘనంగా సత్కరించారు.

Updated Date - Jun 15 , 2026 | 12:22 AM