అప్పన్నకు వైభవంగా శ్రీపుష్పయాగం
ABN , Publish Date - Apr 04 , 2026 | 01:21 AM
వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక తిరుకల్యాణ మహోత్సవాలు శుక్రవారం రాత్రి జరిగిన శ్రీపుష్పయాగంతో పరిసమాప్తమయ్యాయి.
ముగిసిన వార్షిక తిరుకల్యాణోత్సవాలు
సింహాచలం, ఏప్రిల్ 3: (ఆంధ్రజ్యోతి):
వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక తిరుకల్యాణ మహోత్సవాలు శుక్రవారం రాత్రి జరిగిన శ్రీపుష్పయాగంతో పరిసమాప్తమయ్యాయి. సాయంత్రం ఆరు గంటలకు దర్శనాలు నిలిపివేసి, రాత్రి ఆరాధనలు జరిపారు. అనంతరం ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని, శ్రీదేవి, భూదేవి సమేతంగా శోభాయమానంగా అలంకరించి కల్యాణ మండపంలో శేషపాన్పు వాహనంపై అధిష్ఠింపజేశారు. ఆగమశాస్త్ర విధానంలో పన్నెండు రకాల పరిమళ భరిత పుష్పాలతో అర్చించిన అనంతరం 12 రకాల ఫలాలను నివేదించారు.