Share News

వైభవంగా మార్వాడీల కావడి యాత్ర

ABN , Publish Date - Aug 24 , 2026 | 12:33 AM

మార్వాడీల కావడి యాత్ర ఆదివారం వైభవంగా సాగింది. మాధవదార వద్ద ఉదయాన్నే ప్రారంభమైన యాత్ర కంచరపాలెం, తాటిచెట్లపాలెం, అక్కయ్యపాలెం, గురుద్వార మీదుగా బీచ్‌ రోడ్డులోని పాండురంగస్వామి ఆలయానికి చేరుకుంది.

వైభవంగా మార్వాడీల కావడి యాత్ర

విశాఖపట్నం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి):

మార్వాడీల కావడి యాత్ర ఆదివారం వైభవంగా సాగింది. మాధవదార వద్ద ఉదయాన్నే ప్రారంభమైన యాత్ర కంచరపాలెం, తాటిచెట్లపాలెం, అక్కయ్యపాలెం, గురుద్వార మీదుగా బీచ్‌ రోడ్డులోని పాండురంగస్వామి ఆలయానికి చేరుకుంది. సుమారు రెండు వేల మంది భక్తులు యాత్రలో పాల్గొన్నారు. ఏటా శ్రావణమాసంలో మార్వాడీలు కుటుంబబంధాలు బాగుండాలని, పంటలు పండాలని, వర్షాలు కురవాలని కోరుకుంటూ కావడి యాత్రను చేపడతారు. యాత్రలో మహిళలు, చిన్నారులు, యువత పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు కావడితో తీసుకువచ్చిన నీటితో పాండురంగస్వామి ఆలయంలోని శివ లింగానికి పూజలు, అభిషేకాలు చేశారు.

Updated Date - Aug 24 , 2026 | 12:34 AM