Share News

ఉత్తమ సేవా అవార్డుకు గౌరీ పీఏసీఎస్‌ ఎంపిక

ABN , Publish Date - Aug 02 , 2026 | 11:44 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ అనుబంధంతో నిర్వహిస్తున్న గౌరీ పీఏసీఎస్‌ 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉత్తమ సేవలకు గాను బెస్ట్‌ పెర్ఫార్మింగ్‌ అవార్డుకు ఆప్కాబ్‌ గత నెల 31న ఎంపిక చేసినట్టు గౌరీ పీఏసీఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జి కర్రి మహాలక్ష్మినాయుడు తెలిపారు.

ఉత్తమ సేవా అవార్డుకు గౌరీ పీఏసీఎస్‌ ఎంపిక
గౌరీ పీఏసీఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జి మహాలక్ష్మినాయుడును అభినందిస్తున్న ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ

కొత్తూరు, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ అనుబంధంతో నిర్వహిస్తున్న గౌరీ పీఏసీఎస్‌ 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉత్తమ సేవలకు గాను బెస్ట్‌ పెర్ఫార్మింగ్‌ అవార్డుకు ఆప్కాబ్‌ గత నెల 31న ఎంపిక చేసినట్టు గౌరీ పీఏసీఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జి కర్రి మహాలక్ష్మినాయుడు తెలిపారు. ఈ విషయాన్ని ఆదివారం జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణకు తెలియజేయగా పర్సన్‌ ఇన్‌చార్జితో పాటు బ్యాంకు పాలకవర్గ సభ్యులు కాండ్రేగుల లోకేశ్వరరావు, యల్లపు శ్రీనులను ఎమ్మెల్యే అభినందించారు. కో-ఆపరేటివ్‌ బ్యాంకు లిమిటెడ్‌ 63వ ఫౌండేషన్‌ వేడుకలను పురస్కరించుకొని ఈ అవార్డును ఈ నెల 4న విజయవాడ గవర్నర్‌పేటలో ఉన్న మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో అందజేయనున్నారని తెలిపారు. పర్సన్‌ ఇన్‌చార్జి మహాలక్ష్మినాయుడును ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో నూకాంబిక దేవస్థానం చైర్మన్‌ పీలా నాగశ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 02 , 2026 | 11:44 PM