అప్పన్న సన్నిధిలో గోవా గవర్నర్
ABN , Publish Date - Feb 22 , 2026 | 01:28 AM
గోవా గవర్నర్, సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు సతీసమేతంగా శనివారం వరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు.
సింహాచలం, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి):
గోవా గవర్నర్, సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు సతీసమేతంగా శనివారం వరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఈఓ జె.వెంకటేశ్వరరావు ఆలయ ప్రధాన అర్చకులతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అశోక్‌గజపతిరాజు గోత్రనామాలతో అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేసి శేషవస్త్రాన్ని పర్యవేట్టంగా చుట్టారు. కప్పస్తంభ ఆలింగనం, బేడామండప ప్రదక్షిణ, గోదాదేవి అమ్మవారి దర్శనం తరువాత పండితులు చతుర్వేద స్వస్తి వచనాలతో ఆశీర్వచనాలీయగా, ఈఓ శాలువాతో సత్కరించి స్వామివారి ఫొటోను, ప్రసాదాలను అందజేశారు.