నేతన్నలకు ప్రభుత్వం అండ
ABN , Publish Date - Aug 08 , 2026 | 12:41 AM
చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉండి అన్నివిధాలా ఆదుకుంటుందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. పాయకరావుపేటలోని చేనేత సహకార సంఘం కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గస్థాయి ‘జాతీయ చేనేత దినోత్సవం’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రితోపాటు కలెక్టర్ విజయకృష్ణన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, చేనేత అనేది ఒక వృత్తిమాత్రమే కాదని, అది భారతీయ సంస్కృతి, సంప్రదాయం, కళాత్మకమైన నైపుణ్యానికి ప్రతీక అని అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. సొంత మగ్గం కలిగి, 50 ఏళ్లలోపు వయసున్న ప్రతి చేనేత కార్మికుడికి ‘నేతన్న సేవ’ పథకం ద్వారా ఏటా రూ.25 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు.
50 ఏళ్ల లోపువారికి ఏటా రూ.25 వేల ఆర్థిక సాయం
200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు
జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రి వంగలపూడి అనిత
పాయకరావుపేట, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉండి అన్నివిధాలా ఆదుకుంటుందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. పాయకరావుపేటలోని చేనేత సహకార సంఘం కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గస్థాయి ‘జాతీయ చేనేత దినోత్సవం’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రితోపాటు కలెక్టర్ విజయకృష్ణన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, చేనేత అనేది ఒక వృత్తిమాత్రమే కాదని, అది భారతీయ సంస్కృతి, సంప్రదాయం, కళాత్మకమైన నైపుణ్యానికి ప్రతీక అని అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. సొంత మగ్గం కలిగి, 50 ఏళ్లలోపు వయసున్న ప్రతి చేనేత కార్మికుడికి ‘నేతన్న సేవ’ పథకం ద్వారా ఏటా రూ.25 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. 50 ఏళ్లు దాటిన చేనేత కార్మికులందరికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకాన్ని అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. చేనేత కుటుంబానికి నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. చేనేత కార్మికుల జీవనోపాధి మెరుగుపర్చేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. అనంతరం పలువురు చేనేత కార్మికులకు ఆర్థిక సాయాన్ని చెక్కురూపంలో అందజేశారు. అంతకుముందు చేనేత సొసైటీలో తయారుచేసిన జాంధానీ చీరలను మంత్రి కొనుగోలుచేసి, కలెక్టర్ విజయకృష్ణన్, ప్రత్యేకాధికారి కె.శచీదేవిలకు బహూకరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ కొపిశెట్టి వెంకటేశ్, కూటమి నాయకులు పెదిరెడ్డి చిట్టిబాబు తోట నగేశ్, చించెలపు ప్రదీప్, యాళ్ల వరహాలబాబు, మజ్జూరి నారాయణరావు, కంకిపాటి వెంకటేశ్వరరావు, పల్లా విలియంకేరి, తదితరులు పాల్గొన్నారు.