Share News

అన్నదాతకు ప్రభుత్వం అండ

ABN , Publish Date - Mar 14 , 2026 | 12:45 AM

కూటమి ప్రభుత్వం రైతులకు ఎల్లవేళలా అండగా వుంటుందని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. శుక్రవారం స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం (ఆర్‌ఏఆర్‌ఎస్‌)లో కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధ్యక్షతన ‘అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్‌ యోజన’ కింద 2025-26కు సంబంధించి చివరి విడత నిధుల విడుదల కార్యక్రమం జరిగింది.

అన్నదాతకు ప్రభుత్వం అండ
‘అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్‌ యోజన’ మూడో విడత నిధుల నమూనా చెక్కును విడుదల చేస్తున్న ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కలెక్టర్‌ విజయకృష్ణన్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌, నేతలు పీలా గోవింద, కోట్ని బాలాజీ, మళ్ల సురేంద్ర, డి.పరమేశ్వరరావు, తదితరులు

పెట్టుబడిసాయం, రాయితీలు, ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి

ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ

‘అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్‌ యోజన’ నిధులు విడుదల

కొత్తూరు (అనకాపల్లి), మార్చి 13 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం రైతులకు ఎల్లవేళలా అండగా వుంటుందని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. శుక్రవారం స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం (ఆర్‌ఏఆర్‌ఎస్‌)లో కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధ్యక్షతన ‘అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్‌ యోజన’ కింద 2025-26కు సంబంధించి చివరి విడత నిధుల విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కొణతాల మాట్లాడుతూ, ప్రభుత్వం అందజేస్తున్న పెట్టుబడి సాయం, రాయితీలు, ప్రోత్సాహకాలను రైతులు సద్వినియోగం చేసుకొని అధిక పంట దిగుబడుల సాధన ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన ‘సూపర్‌ సిక్స్‌’ హామీలన్నీ నెరవేర్చిన ఘనత సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లకు దక్కుతుందన్నారు. ‘అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్‌ యోజన’ కింద జిల్లాలో 2,42,536 మంది రైతులకు రూ. 134.27 కోట్లు విడుదల అయ్యాయని చెప్పారు. అనంతరం నమూనా చెక్కును విడుదల చేశారు. అంతకుముందు రైతులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌, కార్పొరేషన్ల చైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ, మళ్ల సురేంద్ర, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ కోట్ని బాలాజీ, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ కర్రి సత్యనారాయణ, జిల్లా వ్యవసాయాధికారి ఆశాదేవి, తదితరులు పాల్గొన్నారు.

2,42,536 మంది రైతుల ఖాతాల్లో

రూ.134.27 కోట్లు జమ

అనకాపల్లి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ‘అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్‌ యోజన’ కింద ప్రస్తు ఆర్థిక సంవత్సరంలో చివరి, మూడో విడత నిధులను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. జిల్లాలో 2,42,536 మంది రైతులకు రూ.134.27 కోట్లు మంజూరుకాగా ఆయా రైతుల బ్యాంకు ఖాతాలకు జమయ్యాయి. ఇందులో రూ.97.01 కోట్లు అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం, రూ.37.26 కోట్లు పీఎం కిసాన్‌ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని నమూనా చెక్కులను విడుదల చేశారు. అనకాపల్లి నియోజకవర్గానికి రూ.12.30 కోట్లు, చోడవరానికి రూ.28.38 కోట్లు, మాడుగులకు రూ.25.25 కోట్లు, నర్సీపట్నానికి రూ.19.69 కోట్లు, పాయకరావుపేటకు రూ.21.67 కోట్లు, ఎలమంచిలికి రూ.13.46 కోట్లు, పెందుర్తి నియోజకవర్గంలోని సబ్బవరం, పరవాడ మండలాలకు రూ.8.54 కోట్లు విడుదలయ్యాయి.

Updated Date - Mar 14 , 2026 | 12:45 AM