మహిళలకు ప్రభుత్వ ప్రోత్సాహం
ABN , Publish Date - Mar 14 , 2026 | 11:09 PM
పరిశ్రమల ఏర్పాటులో మహిళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు.
పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని సీఎం సంకల్పం
కలెక్టర్ విజయకృష్ణన్
కోడూరు ఎంఎస్‌ఎంఈ పార్కులో మహిళా శక్తి పరిపాలన భవనానికి భూమి పూజ
అనకాపల్లి రూరల్, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): పరిశ్రమల ఏర్పాటులో మహిళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. మండలంలోని కోడూరులో ఎంఎస్‌ఎంఈ పార్కు సమీపంలో మహిళా శక్తి పరిపాలన భవనం, శిక్షణా కార్యాలయ భవన నిర్మాణానికి శనివారం స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణతో కలిసి ఆమె భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో మహిళా సాధికారత దిశగా కీలక అడుగు పడిందన్నారు. వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో ఐదు లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలన్నదే సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. మహిళలు తమలో ఉన్న ఆలోచనలను వ్యాపార రూపంలో మార్చుకోవాలని ప్రభుత్వం, ఎల్‌పీ వంటి సంస్థలు మహిళలకు పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చే ప్రాధాన్యతకు ఈ పారిశ్రామిక పార్కు ఒక నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ శౌర్యమాన్ పటేల్, ఎల్‌పీ సంస్థ ప్రెసిడెంట్ రమాదేవి, గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర, అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.