గోవాడ చెరకు రైతులకు శుభవార్త
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:47 AM
గోవాడ చెరకు రైతుల ఖాతాలకు త్వరలోనే బకాయిలు జమ చేయనున్నామని స్థానిక ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు తెలిపారు. శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో గోవాడ చెరకు రైతుల బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబరు 249ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవాడ చెరకు రైతుల బకాయిలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిధులు విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు.
- త్వరలో బకాయిల చెల్లింపు
- వచ్చే ఏడాది ఫ్యాక్టరీని నడిపించాలన్నదే లక్ష్యం
- ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు
చోడవరం, సెప్టెంబరు26(ఆంధ్రజ్యోతి): గోవాడ చెరకు రైతుల ఖాతాలకు త్వరలోనే బకాయిలు జమ చేయనున్నామని స్థానిక ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు తెలిపారు. శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో గోవాడ చెరకు రైతుల బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబరు 249ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవాడ చెరకు రైతుల బకాయిలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిధులు విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. గోవాడ చెరకు రైతుల బకాయిలు వారి ఖాతాలకు జమ చేసిన అనంతరం, కార్మికుల బకాయిలు కూడా క్లియర్ చేసి వారికి కూడా న్యాయం చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రైతుల బకాయిలు చెల్లించిన తరువాత గోవాడపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2027లో గోవాడ షుగర్ ఫ్యాక్టరీని తిరిగి నడిపించాలన్నది తన లక్ష్యమని, ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకుడు రొంగలి రమణ పాల్గొన్నారు.