శృంగవరం పంచాయతీకి గుడ్ గవర్నెన్స్ అవార్డు
ABN , Publish Date - May 17 , 2026 | 12:32 AM
జాతీయ స్థాయిలో గ్రామ పంచాయతీల విభాగంలో గుడ్ గవర్నెన్స్- 2026 జాతీయ అవార్డును నాతవరం మండలం శృంగవరం పంచాయతీకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రదానం చేశారు.
- అధికారులకు సీఎం సత్కారం
అనకాపల్లి, మే 16 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో గ్రామ పంచాయతీల విభాగంలో గుడ్ గవర్నెన్స్- 2026 జాతీయ అవార్డును నాతవరం మండలం శృంగవరం పంచాయతీకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రదానం చేశారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో జాతీయ పంచాయతీ అవార్డులు సాధించిన పలు పంచాయతీల ప్రతినిధులను ముఖ్యమంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా నాతవరం మండలానికి చెందిన శృంగవరం గ్రామ పంచాయతీకి గుడ్ గవర్నెన్స్-2026 జాతీయ అవార్డుతో పాటు రూ.కోటి ప్రోత్సాహక నిధిని జిల్లా పంచాయతీ అధికారి ఇ.సందీప్, శృంగవరం పంచాయతీ కార్యదర్శి వి.శ్రీనివాసరావుకు సీఎం అందజేశారు. ఈ సందర్భంగా వారిని ముఖ్యమంత్రి సన్మానించి, గ్రామాభివృద్ధికి వారు చేసిన కృషిని అభినందించారు.