భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రై డే
ABN , Publish Date - Apr 03 , 2026 | 11:02 PM
యేసుకీస్తు శిలువపై ప్రాణాలర్పించిన రోజైన గుడ్ ఫ్రై డేను జిల్లాలోని క్రైస్తవులు శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు.
వాడవాడలా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు
పాడేరు, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): యేసుకీస్తు శిలువపై ప్రాణాలర్పించిన రోజైన గుడ్ ఫ్రై డేను జిల్లాలోని క్రైస్తవులు శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. జిల్లా కేంద్రం మొదలుకుని మండల, పంచాయతీ, గ్రామ స్థాయిల్లోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీస్తు ప్రాణ త్యాగం ప్రత్యేకతను చాటిచెప్పారు. గత 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేసిన క్రైస్తవులు యేసుక్రీస్తుకు శిలువ వేసిన గుడ్ ప్రై డేనాడు ప్రార్థనలు చేశారు. జిల్లా కేంద్రం పాడేరులో సీఎల్‌జేసీ, కారుణ్యా ప్రార్థన మందిరం, సీబీఎం చర్చి, క్రీస్తు మందిరం, తదితర చర్చిల్లో గుడ్ ఫ్రై డే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా యేసు పలికిన ఏడు మాటలను క్రైస్తవులు పవిత్రంగా స్మరించుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో పాస్టర్లు, క్రైస్తవ పెద్దలు, అధిక సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు.