Share News

జుక్కినీకి మంచి డిమాండ్‌

ABN , Publish Date - Apr 09 , 2026 | 11:35 PM

అరుదైన విదేశీ కూరగాయల పంట జుక్కినీకి మంచి డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.70 ధర పలుకుతోంది.

జుక్కినీకి మంచి డిమాండ్‌
విక్రయానికి సిద్ధం చేసిన గ్రీన్‌, ఎల్లో జుక్కినీ

కిలో రూ.70కి విక్రయం

చింతపల్లి, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): అరుదైన విదేశీ కూరగాయల పంట జుక్కినీకి మంచి డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.70 ధర పలుకుతోంది. మండలంలోని తాజంగి పంచాయతీ బలభద్రం గ్రామంలో మహిళా రైతు ఎస్‌.ఝాన్సీరాణి సెర్ప్‌, వెలుగు అధికారుల సహకారంతో గ్రీన్‌, ఎల్లో జుక్కినీ సాగు చేస్తున్నది. ప్రస్తుతం దిగుబడులు అధికంగా వస్తున్నాయి. గిరిజన ప్రాంతం జుక్కినీ సాగుకు అత్యంత అనుకూలమని శాస్త్రవేత్తలు కొన్నేళ్ల క్రితం పరిశోధన ద్వారా నిర్ధారించారు. రెండేళ్లుగా సెర్ప్‌, వెలుగు అధికారులు అరుదైన కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నారు. జుక్కినీ సొరకాయ జాతికి చెందినది కావడంతో పాటు విటమిట్లు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌ అధికంగా ఉంటాయి. బరువు తగ్గడం, జీర్ణక్రియను పెంచడంతోపాటు గుండె ఆరోగ్యం, కంటి చూపును మెరుగు పరుస్తుందని ఉద్యాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Updated Date - Apr 09 , 2026 | 11:35 PM