నూకాంబికకు బంగారు కానుకలు
ABN , Publish Date - Nov 18 , 2026 | 01:04 AM
పట్టణంలోని గవరపాలెం నూకాంబిక అమ్మవారికి ఎన్నారై దంపతులు మంగళవారం సుమారు 48 గ్రాముల బంగారు వస్తువులను సమర్పించారు. పట్టణానికి చెందిన భీమరశెట్టి నాగనంద గోపాల్, హిమబిందు దంపతులు, పెంటకోట ఉదయ్ భాస్కరరావు, సుభాషిణి అమెరికాలో నివసిస్తున్నారు.
పసిడి బొట్టు, చెవి దిద్దులను సమర్పించిన ఎన్‌ఆర్‌ఐలు
అనకాపల్లి టౌన్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని గవరపాలెం నూకాంబిక అమ్మవారికి ఎన్నారై దంపతులు మంగళవారం సుమారు 48 గ్రాముల బంగారు వస్తువులను సమర్పించారు. పట్టణానికి చెందిన భీమరశెట్టి నాగనంద గోపాల్, హిమబిందు దంపతులు, పెంటకోట ఉదయ్ భాస్కరరావు, సుభాషిణి అమెరికాలో నివసిస్తున్నారు. వీరు మంగళవారం ఆలయానికి వచ్చి బంగారు బొట్టు, చెవి దిద్దులను దేవస్థానం ఈవో బీఎల్ నగేశ్ సమక్షంలో సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను, ఆలయ ధర్మకర్తలు సూరే సతీష్, దాడి రవికుమార్, పొలిమేర స్వాతి ఆనంద్, మారిశెట్టి శంకర్రావు, కాండ్రేగుల రాజారావు, మజ్జి జానకి శ్రీనివాసరావు, కొడుకుల శ్రీకాంత్, వడ్డాది మంగ, కోనేటి సూర్యలక్ష్మి, పైడిరాజు, యర్రవరపు సంతోషి కుమారి నాగేశ్ పాల్గొన్నారు.