Share News

అభివృద్ధి, సంక్షేమంలో లక్ష్యాలను సాధించాలి

ABN , Publish Date - Jun 26 , 2026 | 12:04 AM

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో నిర్దేశిత లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని అధికారులను కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్‌లో అందుతున్న అర్జీలను వెంటనే సంబంధిత మండలాలకు పంపించి పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అభివృద్ధి, సంక్షేమంలో లక్ష్యాలను సాధించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

అనకాపల్లి కలెక్టరేట్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో నిర్దేశిత లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని అధికారులను కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్‌లో అందుతున్న అర్జీలను వెంటనే సంబంధిత మండలాలకు పంపించి పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆరు నెలలుగా పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తున్నప్పటికీ కొందరికి అందలేదని అర్జీలు వస్తున్నాయని, తక్షణమే మిగిలిన వాటిని పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలని తహశీల్దార్లు, వీఆర్వోలను ఆదేశించారు. జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌.. ఈ-కేవైసీ, మన మిత్ర, క్రాప్‌ బుకింగ్‌, ఓడీఎఫ్‌ గ్రామాలు, డీఆర్‌డీఏ, స్వచ్ఛాంధ్ర తదితర కార్యక్రమాల పురోగతిని సమీక్షించి నిర్ణీత గడువులో లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. గృహ నిర్మాణాలు, పీఎం సూర్యఘర్‌ యోజన లక్ష్యాలను కూడా సకాలంలో పూర్తి చేయాలన్నారు.

Updated Date - Jun 26 , 2026 | 12:04 AM