పిడుగుపాటుకు బాలిక మృతి
ABN , Publish Date - Jun 13 , 2026 | 10:05 PM
మండలంలోని కోనాపురం పంచాయతీ కరాయిగుడ గ్రామంలో శనివారం సాయంత్రం విషాదం నెలకొంది. పిడుగు పడి బాలిక మృతి చెందింది.
7వ తరగతి చదువుతున్న చిన్నారి
తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు
అనంతగిరి, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కోనాపురం పంచాయతీ కరాయిగుడ గ్రామంలో శనివారం సాయంత్రం విషాదం నెలకొంది. పిడుగు పడి బాలిక మృతి చెందింది. స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. కరాయిగుడ గ్రామానికి చెందిన గుబ్బాయి భారతి (13) శనివారం పొలానికి వెళ్లింది. సాయంత్రం ఆకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి ఇంటికి పరుగెత్తుకుంటూ వెళుతుండగా పిడుగుపాటుకు గురై, ఘటన స్థలంలోనే కుప్పకూలిపోయింది. దీంతో తల్లిదండ్రుల కన్నీరుమున్నీరుగా విలపించారు. భారతి యండపల్లివలస ఏపీఆర్ రెసిడెన్షియల్ పాఠశాలలో 7వ తరగతి పరీక్షలు రాసి, వేసవి సెలవులు నిమిత్తం ఇంటికి వచ్చింది.