ఏకలవ్య ప్రవేశ పరీక్షలో గిరి విద్యార్థుల ప్రతిభ
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:05 PM
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షల్లో జిల్లాకు చెందిన ఇద్దరు గిరిజన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో 1, 2 ర్యాంకులు సాధించారు.
రాష్ట్ర స్థాయిలో 1, 2 ర్యాంకులు
సాధించిన జిల్లా విద్యార్థులు
పాడేరు, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షల్లో జిల్లాకు చెందిన ఇద్దరు గిరిజన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో 1, 2 ర్యాంకులు సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 28, జిల్లాలో 11 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లున్నాయి. వాటిలో ఆరో తరగతిలో ప్రవేశాలకు ప్రతి ఏడాది ఏప్రిల్ నెలలో ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈనెల 4న జిల్లా కేంద్రంలోనే ప్రవేశ పరీక్షను నిర్వహించారు. వాటి ఫలితాలను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. జి.మాడుగుల మండలం వెన్నెల ప్రాథమిక పాఠశాలకు చెందిన ఐదో తరగతి విద్యార్థి వి.జాన్‌విక్లిప్ (89 మార్కులు)కు రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు రాగా, జిల్లా కేంద్రంలోని గుడివాడ ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్ధి పి.రసిల్‌రుష్వి (88 మార్కులు)కు రెండో ర్యాంకు వచ్చింది. జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థులకు రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించడంపై విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.