అల్లం ధర పతనం
ABN , Publish Date - Sep 06 , 2026 | 12:37 AM
హుకుంపేటలో శనివారం జరిగే వారపు సంతలో అల్లం ధర పతనమైంది.
కిలో రూ.35 నుంచి రూ.40లకు
వ్యాపారుల కొనుగోలు
ధర తగ్గింపుపై గిరిరైతుల పెదవివిరుపు
హుకుంపేట, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): హుకుంపేటలో శనివారం జరిగే వారపు సంతలో అల్లం ధర పతనమైంది. రెండో సరి తీసిన అల్లం అధికంగా రావడంతో వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేశారు. ఈసారి తెచ్చిన అల్లం కిలో రూ.35 నుంచి రూ.40లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. దీనిపై గిరిజన రైతులు పెదవి విరిచారు. తమ కష్టానికి తగిన ప్రతిఫలం రాలేదని రైతులు వాపోయారు. తొలిసారి తీసుకువచ్చిన అల్లానికి కిలో రూ.100 నుంచి రూ.150 వరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈసారి తెచ్చిన అల్లానికి కిలో రూ.50 నుంచి రూ.60లకు కొనుగోలు చేసినా బాగుండునని వారన్నారు.