Share News

సర్‌కు సన్నద్ధం

ABN , Publish Date - Jun 15 , 2026 | 12:30 AM

జిల్లాలో సోమవారం నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) జరగునున్నది. ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. జిల్లాలో అనకాపల్లి, ఎలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,529 పోలింగ్‌ బూత్‌లు వున్నాయి. జిల్లాలోని సబ్బవరం, పరవాడ మండలాలు పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వుండడంతో వీటిని విశాఖ జిల్లాకు అటాచ్‌ చేశారు. ప్రతి పోలింగ్‌ బూత్‌కు ఒక బూత్‌ లెవెల్‌ అధికారి (బీఎల్‌వో) ఉంటారు.

సర్‌కు సన్నద్ధం

నేటి నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ

ఇంటింటికీ బీఎల్‌వోలు

ఈ ఏడాది మే నెలాఖరు నాటికి ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరికీ ఎన్యూమరేషన్‌ ఫారాలు

ప్రతిఒక్కరూ పూరించి తప్పనిసరిగా తిరిగి అందజేయాలి

లేనిపక్షంలో జాబితాలో పేరు గల్లంతే

వచ్చే నెల 21న ముసాయిదా ఓటర్ల జాబితాలు విడుదల

ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,529 పోలింగ్‌ బూత్‌లు

నర్సీపట్నం, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారం నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) జరగునున్నది. ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. జిల్లాలో అనకాపల్లి, ఎలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,529 పోలింగ్‌ బూత్‌లు వున్నాయి. జిల్లాలోని సబ్బవరం, పరవాడ మండలాలు పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వుండడంతో వీటిని విశాఖ జిల్లాకు అటాచ్‌ చేశారు. ప్రతి పోలింగ్‌ బూత్‌కు ఒక బూత్‌ లెవెల్‌ అధికారి (బీఎల్‌వో) ఉంటారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పరిశీలన కోసం ఆరుగు ఎలక్ర్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు, 22 మంది అసిస్టెంట్‌ ఎలక్ర్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులను ప్రభుత్వం నియమించింది. బీఎల్వోలు తమ పరిధిలో ఇళ్లకు వెళ్లి, ఎంత మంది ఓటర్లు ఉంటే అంతమందికి రెండేసి చొప్పున ఫారాలు అందజేస్తారు. వాటిని ఎలా నింపాలి అనేది వివరిస్తారు. ఆ ఫారాలు నింపి, వచ్చే నెల 14వ తేదీలోగా బీఎల్‌వోలకు అందజేయాలి. ఈ సమయంలో రెండో ఫారాన్ని రశీదుగా ఓటరుకు తిరిగి ఇస్తారు. బీఎల్‌వో వెళ్లినప్పుడు ఇంటికి తాళం వేసి ఉంటే ఇంటి గేటులో ఉంచడం లేదా పక్కనున్న ఇంట్లో ఇవ్వడం చేస్తారు. తాళం వేసిన ఇంటికి బీఎల్‌వో మూడుసార్లు వెళతారు. అలాగే ఆన్‌లైన్‌లో ఎన్యూమరేషన్‌ ఫారం డౌన్‌లోడ్‌ చేసుకుని వివరాలు నమోదుచేసి అప్‌లోడ్‌ చేసిన తరువాత దాని కాపీలు అందజేసే సదుపాయం కూడా ఉంది. ఓటర్ల నుంచి సేకరించిన ఫారాలను అసెంబ్లీ ఎలకో్ట్రరల్‌ అధికారికి అందజేస్తే దాని ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితా రూపొందిస్తారు. ఏదేమైనా ఎన్యూమరేషన్‌ ఫారాలను బీఎల్‌వోలకు తప్పనిసరిగా అందజేయాలి. లేకపోతే జూలై 21న ప్రచురితం కానున్న ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు ఉండదు. కాగా జూలై 14వ తేదీ నుంచి పోలింగ్‌ బూత్‌లు హేతుబద్ధీకరణ నిర్వహిస్తారు. గరిష్ఠంగా ఒక బూత్‌లో 1,200 మంది ఓటర్లకు మించి ఉండకూడదు. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించిన తరువాత 2002 ఓటర్ల జాబితాతో వివరాలు సరిపోక పోయినా, వ్యత్యాసం ఉన్నా ఓటర్లకు సంబంధిత ఈఆర్వో నోటీసు ఇస్తారు. దీనికి సంబంధించి అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి. జూలై 21 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు అభ్యంతరాలు సమర్పించుకునే అవకాశం ఉంది. ఇంకా జూలై 14వ తేదీలోగా ఎన్యుమరేషన్‌ ఫారం అందించకపోతే ఫారం-6 ద్వారా పేరు నమోదుకు జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు సమయం ఉంది. జూలై 21 నుంచి సెప్టెంబరు 18వ తేదీ వరకు అభ్యంతరాలను పరిష్కరించి సెప్టెంబరు 22న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు.

Updated Date - Jun 15 , 2026 | 12:30 AM