‘స్థానిక’ ఎన్నికలకు సన్నద్ధం
ABN , Publish Date - Oct 09 , 2026 | 12:40 AM
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై గురువారం అమరావతిలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సమీక్ష అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఆయా శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహంచారు.
ముందస్తు ఏర్పాట్లు పూర్తిచేశాం
ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ విజయకృష్ణన్
అనకాపల్లి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై గురువారం అమరావతిలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సమీక్ష అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఆయా శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహంచారు. అనకాపల్లిలోని కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్‌సిన్హా, జేసీ శౌర్యమాన్ పటేల్, డీఆర్‌ఓ సత్యనారాయణరావు పాల్గొని, జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లను కమిషనర్‌కు వివరించారు. కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ, జిల్లాలో రెండు మునిసిపాలిటీలతోపాటు జీవీఎంసీ పరిధిలో అనకాపల్లి జోన్ ఉందని వివరించారు. న్యాయస్థానం ఇచ్చే తుది తీర్పునకు లోబడి రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు సిద్ధంగా వున్నట్టు చెప్పారు. షెడ్యూల్ ఎప్పుడు ప్రకటించినప్పటికీ ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జడ్పీ డిప్యూటీ సీఈఓ సందీప్, జీవీఎంసీ అనకాపల్లి జోనల్ కమిషనర్, నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపల్ కమిషనర్లు, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.
ు ఎన్నికల ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలి....
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా ఎన్నికల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ, గత పర్యాయం జరిగిన ఎన్నికల్లో పంచాయతీల సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల జాబితాలను రీవర్క్ చేసి వివరాలను తనకు సమర్పించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే ఉద్యోగులు ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో సాధారణ, సమస్మాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితాను సమర్పించాలని ఆదేశించారు. ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ, ఎస్‌హెచ్‌ఓలతో కలిసి పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సాధారణ, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా వర్గీకరించాలని సూచించారు.