Share News

స్థానిక ఎన్నికలకు సన్నద్ధం

ABN , Publish Date - Sep 13 , 2026 | 12:57 AM

స్థానిక ఎన్నికలకు సన్నద్ధం

స్థానిక ఎన్నికలకు సన్నద్ధం
ఎంపీ క్యాంపు కార్యాలయంలో సమావేశమైన సీఎం రమేశ్‌, బత్తుల తాతయ్యబాబు, కొండపల్లి అప్పలనాయుడు, ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, పీవీఎస్‌ఎన్‌ రాజు, తదితరులు

ఫోటో: 12ఏకేపీ.2.

- కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం

- బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌, యువతకు ప్రాధాన్యం

- ఎంపీ సీఎం రమేశ్‌, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు

అనకాపల్లి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి పార్టీలు సన్నద్ధమవుతున్నాయని, కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఎంపీ సీఎం రమేశ్‌, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు పిలుపునిచ్చారు. శనివారం ఎంపీ సీఎం రమేశ్‌ క్యాంపు కార్యాలయంలో కూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రమేశ్‌, తాతయ్యబాబు మాట్లాడుతూ మూడు పార్టీల గుర్తులు వేరైనా కూటమి ఒక్కటేనని, ఎక్కడా విభేదాలకు తావులేకుండా సమన్వయంతో ముందుకు సాగుతామని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేందుకు ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించామని, పార్టీ అఽభ్యర్థుల ఎంపికపై ఆయా పార్టీలు నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ కల్పించడంతో పాటు యువతకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. జిల్లాలో కూటమి పార్టీల మధ్య స్పష్టమైన అవగాహన, సమన్వయం ఉందన్నారు. 2024 ఎన్నికల కంటే మరింత ఉత్సాహంతో స్థానిక ఎన్నికల్లో పనిచేస్తామన్నారు. సమావేశంలో కూటమి పార్టీల కో-ఆర్డినేషన్‌ కమిటీ సభ్యులు, టీడీపీ అనకాపల్లి పార్లమెంట్‌ పరిశీలకుడు కొండపల్లి అప్పలనాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, చోడవరం జనసేన ఇన్‌చార్జి పీవీఎస్‌ఎన్‌ రాజు, నర్సీపట్నం మాజీ కౌన్సిలర్‌ అద్దేపల్లి సౌజన్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2026 | 12:57 AM