Share News

31న గవరపాలెం గౌరమ్మ సంబరం

ABN , Publish Date - Jan 28 , 2026 | 12:50 AM

స్థానిక గవరపాలెం గౌరీ పరమేశ్వరుల మహోత్సవం ఈ నెల 31వ తేదీ శనివారం ఘనంగా నిర్వహించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్టు ఉత్సవ కమిటీ చైర్మన్‌ కొణతాల సంతోశ్‌ అప్పారావు నాయుడు చెప్పారు.

31న గవరపాలెం గౌరమ్మ సంబరం
గవరపాలెం గౌరీ పరమేశ్వరుల ఉత్సవాల బ్రోచర్‌ను ఆవిష్కరించిన ఉత్సక కమిటీ ప్రతినిధులు

భారీఎత్తున ఏర్పాట్లు

నేడు ఆమ్మవారికి సారె ఊరేగింపు

ఉత్సవ కమిటీ చైర్మన్‌ వెల్లడి

అనకాపల్లి టౌన్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): స్థానిక గవరపాలెం గౌరీ పరమేశ్వరుల మహోత్సవం ఈ నెల 31వ తేదీ శనివారం ఘనంగా నిర్వహించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్టు ఉత్సవ కమిటీ చైర్మన్‌ కొణతాల సంతోశ్‌ అప్పారావు నాయుడు చెప్పారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉత్సవంలో భాగంగా 28వ తేదీ ఉదయం గౌరీ పరమేశ్వరుల కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తామని, మధ్యాహ్నం పిండివంటలు, మిఠాయిలతో సారె ఊరేగింపు మహోత్సవ వుంటుందని చెప్పారు. 29వ తేదీన కిమ్స్‌ ఐకాన్‌ ఆస్పత్రి సౌజన్యంతో మెగా మెడికల్‌ క్యాంపును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 30వ తేదీన పార్కు జంక్షన్‌ వద్ద తీర్థం నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్తరాంధ్రస్థాయి నృత్య పోటీలు వుంటాయని వెల్లడించారు. 31వ తేదీన గౌరీ పరమేశ్వరుల ఉత్సవం, అదే రోజు రాత్రి దాదాపు 35చోట్ల స్టేజీ ప్రోగ్రాములు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం ఉత్సవ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో కార్యదర్శి కొణతాల శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శులు పీవీ రమణ, కొణతాల మురళీకృష్ణ, దాడి కృష్ణ, పీవీ సత్యనారాయణ, సూరిశెట్టి నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2026 | 12:50 AM