హుకుంపేటలో గ్యాస్ కష్టాలు
ABN , Publish Date - May 27 , 2026 | 12:02 AM
మండలంలో ఇండేన్ గ్యాస్ వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని 22 గ్రామాల్లో గల వినియోగదారులకు హుకుంపేటలోని గ్యాస్ ఏజెన్సీ నుంచే సిలిండర్లు సరఫరా అవుతుంటాయి.
- బుక్ చేసి నెల రోజులు దాటినా సరఫరా కాని సిలిండర్
- వినియోగదారుల గగ్గోలు
హుకుంపేట, మే 26 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఇండేన్ గ్యాస్ వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని 22 గ్రామాల్లో గల వినియోగదారులకు హుకుంపేటలోని గ్యాస్ ఏజెన్సీ నుంచే సిలిండర్లు సరఫరా అవుతుంటాయి. అయితే గ్యాస్ సిలిండర్ బుక్ చేసి నెల రోజులు దాటిపోయినా ఇప్పటి వరకు వినియోగదారులకు సిలిండర్లు సరఫరా కాలేదు. సిలిండర్ల కోసం దూర ప్రాంతాల నుంచి రావడం, స్టాక్ రాలేదని ఏజెన్సీ సిబ్బంది చెప్పడంతో ఖాళీ సిలిండర్‌తో వినియోగదారులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. గ్యాస్ ఏజెన్సీ సిబ్బందిని సంప్రతిస్తే తమకు కూడా నెల రోజులుగా స్టాక్ రావడం లేదని సమాధానం చెబుతున్నారు. దీనిపై కలెక్టర్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.