గన్నెల పీహెచ్‌సీ ముస్తాబు
ABN , Publish Date - Aug 18 , 2026 | 11:05 PM
మండలంలోని గన్నెల పీహెచ్‌సీలో సంజీవని ప్రాజెక్టును సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ పీహెచ్‌సీని ముస్తాబు చేస్తున్నారు. ప్రధాన రహదారి నుంచి పీహెచ్‌సీ భవనం వరకు రోడ్డు నిర్మిస్తున్నారు. పీహెచ్‌సీకి రంగులు వేస్తున్నారు.
సంజీవని ప్రాజెక్టు ప్రారంభానికి ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు
అరకులోయ, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గన్నెల పీహెచ్‌సీలో సంజీవని ప్రాజెక్టును సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ పీహెచ్‌సీని ముస్తాబు చేస్తున్నారు. ప్రధాన రహదారి నుంచి పీహెచ్‌సీ భవనం వరకు రోడ్డు నిర్మిస్తున్నారు. పీహెచ్‌సీకి రంగులు వేస్తున్నారు. పీహెచ్‌సీ ప్రాంగణంలోని ఖాళీ స్థలాని చదును చేస్తున్నారు. ఆస్పత్రి ఎదురుగా ఉన్న టీడబ్ల్యూ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో ఉన్న సమస్యలను గుర్తించి మరమ్మతులు చేయించేందుకు ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఈ నెల 22న ఇక్కడికి వస్తారని ప్రచారం జరుగుతున్నప్పటికీ అధికారులు ఇంకా ఖరారు చేయలేదు. ముఖ్యమంత్రి పర్యటన తేదీ మారవచ్చని తెలిసింది. అయితే ఇక్కడ పనులు మాత్రం జోరుగా సాగుతున్నాయి.