కొట్టుకుపోయిన గంగవరం తాత్కాలిక కల్వర్టు
ABN , Publish Date - Sep 24 , 2026 | 12:33 AM
జీకేవీధి మండలం ధారకొండ పంచాయతీ పరిధిలోని గంగవరం తాత్కాలిక కల్వర్టు వరద ఉధృతికి మంగళవారం రాత్రి కొట్టుకుపోయింది. దీంతో 10 గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి.
10 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
సీలేరు, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం ధారకొండ పంచాయతీ పరిధిలోని గంగవరం తాత్కాలిక కల్వర్టు వరద ఉధృతికి మంగళవారం రాత్రి కొట్టుకుపోయింది. దీంతో 10 గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నెలలో ఈ కల్వర్టు కొట్టుకుపోవడం రెండవసారి. ఈ నెల 12న ఈ కల్వర్టు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆదేశాల మేరకు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి ఈ నెల 15 న రాకపోకలను పునరుద్ధరించారు. వారం రోజులు తిరక్క ముందే మళ్లీ కల్వర్టు కొట్టుకుపోవడంతో 10 గ్రామాల గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు.