యుద్ధప్రాతిపదిక గంగవరం కల్వర్టు పూర్తి
ABN , Publish Date - Sep 16 , 2026 | 01:07 AM
జీకేవీధి మండలం ధారకొండ పంచాయతీ పరిధిలో అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఈనెల 12వ తేదీన కొట్టుకుపోయిన గంగవరం కల్వర్టును యుద్ధప్రాతిపదిక 15వ తేదీనాటికి అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. వర్షాలకు ధారకొండ పంచాయతీ పరిధిలోని 10 గిరిజన గ్రామాలతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయంటూ పత్రికల్లో, సోషల్ మీడియా, టీవీ ఛానల్లో వచ్చిన వార్తలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. కొట్టుకుపోయిన గంగవరం కల్వర్టు మరమ్మతులను వెంటనే చేపట్టి రాకపోకలు పునరుద్ధరించాలంటూ పంచాయతీరాజ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పత్రికల్లో వచ్చిన వార్తలకు స్పందించిన
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్
వెంటనే మరమ్మతులు చేసి
రాకపోకలు పునరుద్ధరించాలని ఆదేశం
12న కొట్టుకుపోతే 15వ తేదీకి
సిద్ధం చేసిన పంచాయతీరాజ్ అధికారులు
సీలేరు, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి):
జీకేవీధి మండలం ధారకొండ పంచాయతీ పరిధిలో అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఈనెల 12వ తేదీన కొట్టుకుపోయిన గంగవరం కల్వర్టును యుద్ధప్రాతిపదిక 15వ తేదీనాటికి అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. వర్షాలకు ధారకొండ పంచాయతీ పరిధిలోని 10 గిరిజన గ్రామాలతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయంటూ పత్రికల్లో, సోషల్ మీడియా, టీవీ ఛానల్లో వచ్చిన వార్తలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. కొట్టుకుపోయిన గంగవరం కల్వర్టు మరమ్మతులను వెంటనే చేపట్టి రాకపోకలు పునరుద్ధరించాలంటూ పంచాయతీరాజ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డీఈఈ కల్యాణకుమార్, సిబ్బంది ఆదివారం పనులను ప్రారంభించి, మంగళవారం నాటికి పూర్తిచేసి, రాకపోకలను పునరుద్ధరించారు.
శాశ్వత వంతెన నిర్మించాలి
గంగవరం వద్ద కల్వర్టు స్థానే వంతెన శాశ్వత వంతెనను అధికారులు నిర్మించాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు. 2024 సెప్టెంబరులో సంభవించిన తుఫాన్ ఉధృతికి కొట్టుకుపోయిన గంగవరం వంతెనను శాశ్వత ప్రాతిపదికన నిర్మించకుండా రాకపోకలకు అనువుగా తూములతో కల్వర్టును ఏర్పాటు చేసి మిన్నకున్నారు. ఈ కల్వర్టు ఈనెల 12వ తేదీన కురిసిన వర్షానికి కొట్టుకుపోవడం రెండోసారి అని వారంటున్నారు. అందువల్ల గంగవరం వద్ద శాశ్వత వంతెన నిర్మించాలనేఇ ఏపీ గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు పాంగి నాగేశ్వరరావు, సీపీఐ మండల కార్యదర్శి కవర్ల భగవాన్, పెసా అధ్యక్షుడు వంతల చిట్టినాయుడు కోరారు.