Share News

రూర్బన్‌ పంచాయతీలుగా గంభీరం, వేములవలస

ABN , Publish Date - Apr 05 , 2026 | 12:05 AM

జనాభా, ఆదాయం అంశాల ప్రాతిపదికగా పలు పంచాయతీలను అప్‌గ్రేడ్‌ చేశారు.

రూర్బన్‌ పంచాయతీలుగా గంభీరం, వేములవలస

మరో 25 పంచాయతీలు గ్రేడ్‌-1, 23 పంచాయతీలకు గ్రేడ్‌-2

29 పంచాయతీలకు గ్రేడ్‌-3 హోదా

విశాఖపట్నం/ఆనందపురం/పద్మనాభం, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి):

జనాభా, ఆదాయం అంశాల ప్రాతిపదికగా పలు పంచాయతీలను అప్‌గ్రేడ్‌ చేశారు. కొన్నింటికి కొత్తగా రూర్బన్‌, గ్రేడ్‌-1, 2, 3 హోదా కల్పించారు. జిల్లాలోని ఆనందపురం మండలంలో గల గంభీరం, వేములవలసలను రూర్బన్‌ పంచాయతీలుగా మార్పు చేశారు. అదేవిధంగా మరో 25 గ్రామ పంచాయతీలను గ్రేడ్‌-1కు, 23 పంచాయతీలను గ్రేడ్‌-2కు, 29 పంచాయతీలను గ్రేడ్‌-3కు అప్‌గ్రేడ్‌ చేశారు. ఇప్పటివరకు గ్రేడ్‌-1 నుంచి ఐదు కేటగిరీల వరకు పంచాయతీలు ఉండేవి. అయితే జనాభా, ఆదాయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పంచాయతీల హోదాలో మార్పులు చేశారు. పది వేల జనాభా లేదా ఏడాదికి రూ.కోటి ఆదాయం ఉన్న పంచాయతీలను రూర్బన్‌ పంచాయతీలుగా మార్చారు. గంభీరం, వేములవలస పంచాయతీల వార్షిక ఆదాయం రూ.కోటికిపైగా ఉంది. ఈ పంచాయతీలకు కార్యదర్శిగా డిప్యూటీ ఎంపీడీవో కేటగిరీ ఉన్న గెజిటెడ్‌ అధికారి ఉంటారు.

కాగా ఆనందపురం మండలంలో ఐదు, భీమిలి మండలంలో ఐదు, పద్మనాభం మండలంలో ఎనిమిది, పెందుర్తి మండలంలో ఏడు పంచాయతీలను గ్రేడ్‌-1కు అప్‌గ్రేడ్‌ చేశారు. ఆనందపురం మండలంలో ఐదు, భీమిలి మండలంలో ఎనిమిది, పద్మనాభం మండలంలో ఏడు, పెందుర్తి మండలంలో మూడు పంచాయతీలను గ్రేడ్‌-2కు, ఆనందపురం మండలంలో 14, భీమిలి మండలంలో మూడు, పద్మనాభం మండలంలో ఏడు, పెందుర్తి మండలంలో ఐదు పంచాయతీలను గ్రేడ్‌-3కు అప్‌గ్రేడ్‌ చేశారు.

గ్రేడ్‌-1 పంచాయతీలుగా అప్‌గ్రేడ్‌ అయినవి...ఆనందపురం మండలం ఆనందపురం, గిడిజాల, గొట్టిపల్లి, శొంఠ్యాం, వెల్లంకి, భీమిలి మండలం చిప్పాడ, దాకమర్రి, పెదనాగమయ్యపాలెం, తాళ్లవలస, తాటితూరు, పద్మనాభం మండలం అనంతవరం, బీఆర్‌ తాళ్లవలస, కోరాడ, మద్ది, నేరేళ్లవలస, పద్మనాభం, పాండ్రంకి, రెడ్డిపల్లి అగ్రహారం, పెందుర్తి మండలం గుర్రంపాలెం, పినగాడి, రాజయ్యపేట, రాంపురం, సరిపల్లి, ఎస్‌ఆర్‌ పురం, వాలిమెరక.

గ్రేడ్‌-2 పంచాయతీలు...ఆనందపురం మండలం కుసులవాడ, లొడగలవానిపాలెం, మామిడిపాలెం, తర్లువాడ, భీమిలి మండలం అవనాం, అన్నవరం, బోడమెట్టపాలెం, లక్ష్మిపురం, మూలకుద్దు, నగరంపాలెం, రేఖవానిపాలెం, సింగన్నబంద, పద్మనాభం మండలం రేవిడి, తునివలస, సీహెచ్‌ అగ్రహారం, పెందుర్తి మండలం గొరపల్లి, పెదగాడి

గ్రేడ్‌-3 పంచాయతీలు...ఆనందపురం మండలం బీపీ కల్లాలు, భీమన్నదొరపాలెం, బోని, చందక, గండిగుండం, కణమాం, కోలవానిపాలెం, ముకుందపురం, ముచ్చెర్ల, పాలవలస, పందలపాక, పేకేరు, రామవరం, శిర్లపాలెం, భీమిలి మండలం మజ్జిపేట, నారాయణరాజుపేట, పద్మనాభం మండలం బాందేవపురం, శేరిఖండం, చిన్నాపురం, పెంట, వెంకటాపురం, విలాసకన్నపాలెం, బుడ్డివలస అగ్రహారం, పెందుర్తి మండలం చింతగట్ల, గవరపాలెం, జంగాలపాలెం, జెర్రిపోతుల పాలెం, ముదపాక.

Updated Date - Apr 05 , 2026 | 12:05 AM