Share News

ఇబ్బడిముబ్బడిగా నిధులు

ABN , Publish Date - May 27 , 2026 | 12:14 AM

నర్సీపట్నంలో అభివృద్ధి పనులకు విశాఖ మెట్రో రీజియన్‌ అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ఇబ్బడిముబ్బడిగా నిధులు కేటాయిస్తున్నది. స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్‌ అయ్యన్నప్రాతుడు ప్రత్యేక శ్రద్ధ చూపడంతో గత రెండేళ్ల కాలంలో మూడు విడతల్లో మొత్తం రూ.16.5 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో పలు వార్డుల్లో 198 అభివృద్ధి పనులు చేపట్టారు. వీటిల్లో కొన్నిపనులు ఇప్పటికే పూర్తికాగా, మిగిలిన పనులు వివిధ దశల్లో వున్నాయి. వార్డుల్లో ఇటీవల వరకు మట్టి రోడ్లుగా వున్న వీధుల్లో సీసీ రోడ్లు వేస్తున్నారు. డ్రైనేజీ కాలువలు, అవసరమైన ప్రదేశాలతోపాటు, గతంలో నిర్మించి, శిథిలమైన కల్వర్టుల స్థానంలో కొత్తవి నిర్మిస్తున్నారు.

ఇబ్బడిముబ్బడిగా నిధులు
బీసీ కాలనీలో మట్టి రోడ్డు (ఫైల్‌ ఫొటో)

నర్సీపట్నం అభివృద్ధికి రూ.16.5 కోట్లు కేటాయించిన వీఎంఆర్‌డీ

పలు వార్డుల్లో 198 పనులు

నర్సీపట్నం, మే 26 (ఆంధ్రజ్యోతి): నర్సీపట్నంలో అభివృద్ధి పనులకు విశాఖ మెట్రో రీజియన్‌ అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ఇబ్బడిముబ్బడిగా నిధులు కేటాయిస్తున్నది. స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్‌ అయ్యన్నప్రాతుడు ప్రత్యేక శ్రద్ధ చూపడంతో గత రెండేళ్ల కాలంలో మూడు విడతల్లో మొత్తం రూ.16.5 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో పలు వార్డుల్లో 198 అభివృద్ధి పనులు చేపట్టారు. వీటిల్లో కొన్నిపనులు ఇప్పటికే పూర్తికాగా, మిగిలిన పనులు వివిధ దశల్లో వున్నాయి. వార్డుల్లో ఇటీవల వరకు మట్టి రోడ్లుగా వున్న వీధుల్లో సీసీ రోడ్లు వేస్తున్నారు. డ్రైనేజీ కాలువలు, అవసరమైన ప్రదేశాలతోపాటు, గతంలో నిర్మించి, శిథిలమైన కల్వర్టుల స్థానంలో కొత్తవి నిర్మిస్తున్నారు.

వీఎంఆర్‌డీఏ మొదటి విడత రూ.4.11 కోట్లు మంజూరు చేయగా, ఈ నిధులతో 43 చేపట్టారు. ఇందులో 22 సీసీ రోడ్లు, ఐదు సీసీ రోడ్లు కమ్‌ కాలువలు, ఒకచోట సిమెంట్‌ రోడ్డు, కల్వర్టు, రెండుచోట్ల కల్వర్టులు వున్నాయి. ఈ పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. రెండో విడత రూ.5 కోట్లు మంజూరుచేయగా 64 పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో సిమెంటు రోడ్లు 36, సిమెంటు రోడ్లు/ కాలువలు తొమ్మిది, సిమెంటు కాలువలు/ కల్వర్టులు 17, ఒక సామాజిక భవనం, స్కేంటింగ్‌ రింక్‌ ఉన్నాయి. ఇందులో 43 పూర్తి చేశారు. మిగిలిన పనులు వివిధ దశల్లో వున్నాయి. మూడో విడత రూ.8 కోట్లు మంజూరు కాగా 81 అభివృద్ధి పనులు గుర్తించారు. సిమెంటు రోడ్లు 50, సిమెంటు రోడ్లు/ కాలువ పనులు మూడు, సీసీ డ్రైనేజీ కాలువలు/ కల్వర్టు పనులు 26, బీటీ రోడ్డు/ సిమెంటు డ్రైనేజీ ఒకటి, డ్రైనేజీ/ కర్బ్‌వాల్‌ ఒకటి చేపట్టారు.

Updated Date - May 27 , 2026 | 12:14 AM