Share News

అర్జీదారులకు ఉచిత భోజనం

ABN , Publish Date - May 23 , 2026 | 12:20 AM

ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి వచ్చే అర్జీదారులందరికీ ఉచిత భోజన సదుపాయం కల్పిస్తామని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి అన్నారు.

అర్జీదారులకు ఉచిత భోజనం
అర్జీదారునికి భోజనం వడ్డిస్తున్న కలెక్టర్‌ టి.నిషాంతి

ఐటీడీఏలో ప్రారంభించిన కలెక్టర్‌ నిషాంతి

పాడేరు, మే 22(ఆంధ్రజ్యోతి): ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి వచ్చే అర్జీదారులందరికీ ఉచిత భోజన సదుపాయం కల్పిస్తామని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి అన్నారు. ఈమేరకు ఐటీడీఏ ప్రాంగణంలోని క్యాంటీన్‌లో శుక్రవారం ఆమె ఉచిత భోజన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. వివిధ ప్రాంతాల నుంచి పీజీఆర్‌ఎస్‌లో వినతులను సమర్పించేందుకు వచ్చే వారి ఆకలి తీర్చాలనే లక్ష్యంతోనే వారికి ఉచిత భోజన సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయించామన్నారు. అర్జీలు సమర్పించిన సమయంలోనే వారికి భోజన టోకెన్లను జారీ చేస్తారని, వాటిని చూపించి క్యాంటిన్‌లో ఉచితంగా భోజనం చేయాలన్నారు. ఈసందర్భంగా భోజనాలు చేస్తున్న పలువురుని కలెక్టర్‌ పలుకరించారు. పీజీఆర్‌ఎస్‌ అర్జీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ టి.నిషాంతి కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డీఆర్‌డీఏ పీడీ వి.మురళీ, సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు, ఐసీడీఎస్‌ పీడీ ఝాన్సీబాయి, టీడబ్ల్యూ డీడీ పీబీకే.పరిమిళ, ఐటీడీఏ ఏవో ఎం.హేమలత, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2026 | 12:20 AM