Share News

కాశీ, అయోధ్య ఉచిత దివ్య దర్శన యాత్ర

ABN , Publish Date - Jul 20 , 2026 | 01:05 AM

రెండేళ్ల క్రితం ఎన్నికల సమయంలో అనకాపల్లి పార్లమెంట్‌ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సుమారు 1,500 మంది భక్తులను ప్రత్యేక రైలులో వారాణసి (కాశీ), అయోధ్య యాత్రకు పంపినట్టు ఎంపీ సీఎం రమేశ్‌ చెప్పారు. ‘కాశీ, అయోధ్య ఉచిత దివ్య దర్శన యాత్ర’ పేరుతో ఆదివారం అనకాపల్లి స్టేషన్‌ నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలుకు రమేశ్‌ దంపతులతోపాటు ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తి, కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, పంచకర్ల రమేశ్‌బాబు తదితరులు జెండా ఊపారు. అంతకుముందు రైలు బోగీల్లో పలువురు ప్రయాణికులతో మాట్లాడారు.

కాశీ, అయోధ్య ఉచిత దివ్య దర్శన యాత్ర
జెండా ఊపి రైలును ప్రారంభిస్తున్న ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్యేలు కొణతాల, బండారు, రాజు, పంచకర్ల

అనకాపల్లిలో ప్రత్యేక రైలుకు జెండా ఊపిన ఎంపీ రమేశ్‌, ఎమ్మెల్యేలు

అనకాపల్లి టౌన్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): రెండేళ్ల క్రితం ఎన్నికల సమయంలో అనకాపల్లి పార్లమెంట్‌ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సుమారు 1,500 మంది భక్తులను ప్రత్యేక రైలులో వారాణసి (కాశీ), అయోధ్య యాత్రకు పంపినట్టు ఎంపీ సీఎం రమేశ్‌ చెప్పారు. ‘కాశీ, అయోధ్య ఉచిత దివ్య దర్శన యాత్ర’ పేరుతో ఆదివారం అనకాపల్లి స్టేషన్‌ నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలుకు రమేశ్‌ దంపతులతోపాటు ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తి, కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, పంచకర్ల రమేశ్‌బాబు తదితరులు జెండా ఊపారు. అంతకుముందు రైలు బోగీల్లో పలువురు ప్రయాణికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ రమేశ్‌ మీడియాతో మాట్లాడుతూ, అనకాపల్లి నుంచి వారాణసికి మొట్టమొదటి ఉచిత ఆధ్యాత్మిక ప్రత్యేక రైలును ప్రారంభించామన్నారు. అయోధ్య, కాశీ దర్శనం ప్రతి హిందువు జీవితంలో ఒక అనుభూతి అన్నారు. పేదలకు శ్రీరాముడు, కాశీవిశ్వనాథుని దర్శనం కల్పించాలనే సంకల్పంతో ఈ యాత్రను ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణంతోపాటు అనిఇ్న రోజులు భోజనం, వసతితోసహా అన్నీ ఉచితంగా అందిస్తున్నామన్నారు. భక్తులతోపాటు రైలులో మందులతోకూడిఇన ప్రత్యేక వైద్యబృందం కూడా వెళుతున్నట్టు చెప్పారు. వారాణసిలో భక్తులకు ఏర్పాట్లు చేయడానికి ముందుగానే ఒక బృందాన్ని పంపించామన్నారు. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని భక్తులకు దశల వారీగా ఈ యాత్రకు అవకాశం కల్పిస్తామన్నారు. రెండో విడత ఆధ్యాత్మిక టూరు సెప్టెంబరులో వుంటుందన్నారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ, వందేభారత్‌ రైలుకు అనకాపల్లిలో హాల్ట్‌ కల్పించేందుకు ఎంపీ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బుద్ద నాగజగదీశ్వరరావు, మళ్ల సురేంద్ర, పీవీజీ కుమార్‌, కోట్ని బాలాజీ, దాడి రత్నాకర్‌, మాదంశెట్టి నీలబాబు, ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, సురేంద్రమోహన్‌, స్టేషన్‌ మేనేజర్‌ కె.రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. మొత్తం 16 స్లీపర్‌ బోగీలు, రెండు ఏసీ బోగీలు, రెండు జనరల్‌ బోగీలు వున్న ఈ రైలులో ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు పెందుర్తి వరకు భక్తులతో కలిసి ప్రయాణం చేశారు.

Updated Date - Jul 20 , 2026 | 01:05 AM