Share News

రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీలకు నలుగురి ఎంపిక

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:21 AM

స్కూల్‌ గేమ్స్‌ రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీలకు తమ పాఠశాల నుంచి నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారని అరకులోయ గురుకుల క్రీడా పాఠశాల ప్రిన్సిపల్‌ పీఎస్‌ఎన్‌ మూర్తి బుధవారం తెలిపారు.

రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీలకు నలుగురి ఎంపిక
రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీలకు ఎంపికైన విద్యార్థులు, కోచ్‌తో ప్రిన్సిపాల్‌ పీఎస్‌ఎన్‌ మూర్తి

ఉమ్మడి విశాఖ జిల్లా తరఫున పాల్గొననున్న అరకు క్రీడా పాఠశాల విద్యార్థులు

అరకులోయ, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): స్కూల్‌ గేమ్స్‌ రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీలకు తమ పాఠశాల నుంచి నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారని అరకులోయ గురుకుల క్రీడా పాఠశాల ప్రిన్సిపల్‌ పీఎస్‌ఎన్‌ మూర్తి బుధవారం తెలిపారు. ఇటీవల తమ పాఠశాలలో జరిగిన జిల్లాస్థాయి వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి అండర్‌-17, అండర్‌-19 విభాగాల్లో టి.ప్రతాప్‌కుమార్‌, డి.రాంప్రసాద్‌, ఎస్‌.జేమ్స్‌, సీహెచ్‌ జైకేతన్‌ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. వీరు ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు కాకినాడలో జరిగే రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో ఉమ్మడి విశాఖ జిల్లా తరఫున పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థులతో పాటు కోచ్‌ డి.సిద్ధయ్యను ఆయన అభినందించారు.

Updated Date - Oct 08 , 2026 | 12:21 AM