120 కిలోల గంజాయితో నలుగురి అరెస్టు
ABN , Publish Date - Mar 13 , 2026 | 12:51 AM
మండలంలోని పైడిపాల సెంటర్ వద్ద 120 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేసినట్టు నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు వెల్లడించారు. గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ముగ్గురు పరారీ, మినీట్రక్కుతోపాటు బైక్ సీజ్
మాకవరపాలెం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పైడిపాల సెంటర్ వద్ద 120 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేసినట్టు నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు వెల్లడించారు. గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
మండలంలోని పైడిపాల సెంటర్ వద్ద గురువారం ఉదయం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో నర్సీపట్నం వైపు నుంచి తాళ్లపాలెం వైపు వెళుతున్న బైక్, మినీ ట్రక్కును ఆపారు. ఈ క్రమంలో ట్రక్కులో నుంచి ముగ్గురు వ్యక్తులు దూకి పరారయ్యారు. ట్రక్కును తనిఖీ చేయగా 120 కిలోల గంజాయి బయటపడింది. ట్రక్కులో వున్న ముగ్గురితోపాటు బైక్‌పై వెళుతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వీరు గొలుగొండ మండలం పోలవరం గ్రామానికి చెందిన కొప్పి సత్తిబాబు, పాకలపాడుకు చెందిన కర్రి కృష్ణ, మాకవరపాలెం మండలం పెద్దిపాలేనికి చెందిన పైల సురేశ్, నర్సీపట్నానికి చెందిన పరవాడ శ్రీనివాసరావుగా గుర్తించారు. ఒడిశాలోని చిత్రకొండ ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి తాళ్లపాలెం మీదుగా విజయవాడకు తరలిస్తున్నట్టు నిందితులు చెప్పారు. పరారైన ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మినీట్రక్కు, బైక్‌తోపాటు నాలుగు మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో సీఐ రేవతమ్మ, ఎస్‌ఐ దామోదరనాయుడు,. పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.