Share News

నేడు ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లకు శంకుస్థాపన

ABN , Publish Date - Jun 28 , 2026 | 12:32 AM

మండలంలోని పెదతీనార్ల శివారు దొండవాక, రాజయ్యపేట శివారు బోయపాడు తీర గ్రామాల్లో రెండు ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల (ఎఫ్‌ఎల్‌సీ)నిర్మాణానికి ఆదివారం ఉదయం మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. హోం మంత్రి అనిత చొరవతో ప్రభుత్వం ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

 నేడు ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లకు శంకుస్థాపన
ఎఫ్‌ఎల్‌సీ సెంటర్‌ నిర్మించే దొండవాక సముద్ర తీరం

- రూ.34.48 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

నక్కపల్లి, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెదతీనార్ల శివారు దొండవాక, రాజయ్యపేట శివారు బోయపాడు తీర గ్రామాల్లో రెండు ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల (ఎఫ్‌ఎల్‌సీ)నిర్మాణానికి ఆదివారం ఉదయం మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. హోం మంత్రి అనిత చొరవతో ప్రభుత్వం ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వీటి నిర్మాణానికి రూ.34.48 కోట్ల నిధులను కేటాయించింది. టెండర్లు నిర్వహణ బాధ్యతను ఏపీ మారిటైమ్‌ బోర్డుకు ప్రభుత్వం అప్పగించింది. బోయపాడు సముద్రతీరంలో రూ.17.9 కోట్లు, దొండవాక తీరంలో రూ.16.58 కోట్ల వ్యయంతో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లను నిర్మించనున్నారు. వీటి నిర్మాణం పూర్తయి, వాడుకలోకి వస్తే మత్స్యకారుల జీవనోపాధికి ఎంతో మేలు జరుగుతుంది. హోం మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల శాఖా మంత్రి జనార్దన్‌రెడ్డి బోయపాడులో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లకు శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి మత్స్యశాఖాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Updated Date - Jun 28 , 2026 | 12:32 AM