Share News

‘ఇన్‌ఫినిక్స్‌’కు శంకుస్థాపన

ABN , Publish Date - Sep 02 , 2026 | 01:36 AM

నగరంలోని కాపులుప్పాడ ఐటీ పార్కు ఫేజ్‌-1లో ఇన్‌ఫినిక్స్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ క్యాంపస్‌ నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన చేశారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌, సంస్థ ఎండీ సుదీప్‌ టాండన్‌, సీఈఓ శ్రీనివాస్‌ మండా పాల్గొన్నారు.

‘ఇన్‌ఫినిక్స్‌’కు శంకుస్థాపన

రూ.170 కోట్ల పెట్టుబడి

నాలుగు వేల మందికి ఉపాధి

విశాఖపట్నం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి):

నగరంలోని కాపులుప్పాడ ఐటీ పార్కు ఫేజ్‌-1లో ఇన్‌ఫినిక్స్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ క్యాంపస్‌ నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన చేశారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌, సంస్థ ఎండీ సుదీప్‌ టాండన్‌, సీఈఓ శ్రీనివాస్‌ మండా పాల్గొన్నారు. ప్రభుత్వం ఇన్‌ఫినిక్స్‌కు 5.08 ఎకరాలను ఎకరా రెండు కోట్ల రూపాయల చొప్పున కేటాయించింది. అందులో రూ.170 కోట్లతో ఐటీ భవన సముదాయం నిర్మిస్తారు. అందులో నాలుగు వేల మందికి ఉపాధి కల్పించడానికి హామీ ఇచ్చారని ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ సింహాచలం తెలిపారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో కూడిన హెల్త్‌ కేర్‌ రెవెన్యూ సైకిల్‌ మేనేజ్‌మెంట్‌లో ఇన్‌ఫినిక్స్‌ సేవలు అందిస్తోంది.

Updated Date - Sep 02 , 2026 | 01:36 AM