Share News

డోజ్కోకు జనవరి 12న శంకుస్థాపన

ABN , Publish Date - Nov 14 , 2026 | 01:04 AM

మండలంలోని రాచపల్లి రెవెన్యూ పరిధి ఎరకన్నపాలెంలో డోజ్కో కంపెనీ నిర్మాణ పనులకు జనవరి 12వ తేదీన మంత్రి నారా లోకేశ్‌ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ ప్రతినిధులతోపాటు రష్యాకు చెందిన నిర్మాణ నిపుణుల బృందం శుక్రవారం ఇక్కడకు వచ్చి కంపెనీకి కేటాయించిన భూములను పరిశీలించారు.

డోజ్కోకు జనవరి 12న శంకుస్థాపన
డోజ్కో కంపెనీకి ప్రభుత్వం కేటాయించిన భూములను పరిశీలిస్తున్న కంపెనీ ప్రతినిధులు, రష్యా బృందం

భూమి పూజకు హాజరుకానున్న మంత్రి నారా లోకేశ్‌

మాకవరపాలెం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రాచపల్లి రెవెన్యూ పరిధి ఎరకన్నపాలెంలో డోజ్కో కంపెనీ నిర్మాణ పనులకు జనవరి 12వ తేదీన మంత్రి నారా లోకేశ్‌ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ ప్రతినిధులతోపాటు రష్యాకు చెందిన నిర్మాణ నిపుణుల బృందం శుక్రవారం ఇక్కడకు వచ్చి కంపెనీకి కేటాయించిన భూములను పరిశీలించారు. రాచపల్లి రెవెన్యూ 737 సర్వే నంబరులో 150 ఎకరాలను ప్రభుత్వం ఈ కంపెనీకి కేటాయించిన విషయం తెలిసిందే. సుమారు రూ.1,256 కోట్ల పెట్టుబడితో ఎర్త్‌మూవర్‌ యంత్రాలు, విడిభాగాల తయారీ యూనిట్‌ను నెలకొల్పనున్నారు. మొదటి దశలో 1,400 మందికి, రెండో దశలో 2,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని వారు తెలిపారు.

Updated Date - Nov 14 , 2026 | 01:04 AM