Share News

కాఫీ యూనిట్‌కు 13న శంకుస్ధాపన

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:35 AM

మండలంలోని శెట్టిపాలెంలో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలే ఏర్పాటు చేయనున్న కాఫీ పొడి ప్రాసెసింగ్‌ యూనిట్‌ నిర్మాణ పనులకు ఈ నెల 13వ తేదీన శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు శంకుస్ధాపన చేయనున్నట్టు జీసీసీ ఎస్‌ఈ కేవీఎస్‌ఎన్‌ కుమార్‌, ఈఈ వేణుగోపాల్‌ తెలిపారు.

 కాఫీ యూనిట్‌కు 13న శంకుస్ధాపన
కాఫీ పొడి ప్రాసెసింగ్‌ యూనిట్‌ శంకుస్థాపన కార్యక్రమానికి స్వీకర్‌ అయ్యన్నపాత్రుడుని ఆహ్వానిస్తున్న జీసీసీ అధికారులు

స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుని ఆహ్వానించిన జీసీసీ అధికారులు

మాకవరపాలెం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): మండలంలోని శెట్టిపాలెంలో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలే ఏర్పాటు చేయనున్న కాఫీ పొడి ప్రాసెసింగ్‌ యూనిట్‌ నిర్మాణ పనులకు ఈ నెల 13వ తేదీన శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు శంకుస్ధాపన చేయనున్నట్టు జీసీసీ ఎస్‌ఈ కేవీఎస్‌ఎన్‌ కుమార్‌, ఈఈ వేణుగోపాల్‌ తెలిపారు. వీరు బుధవారం రాత్రి నర్సీపట్నంలో స్పీకర్‌ క్యాంపు కార్యాలయానికి వెళ్లి అయ్యన్నపాత్రుడుని కలిసి, శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈఈ వేణుగోపాల్‌ మాట్లాడుతూ, సుమారు రూ.10 కోట్లతో నిర్మించే కాఫీ పొడి ప్రాసెసింగ్‌ యూనిట్‌ పనులు ఆరు నెలల్లో పూర్తవుతాయని చెప్పారు. మొదటి దశలో 400 మంది మహిళలకు, రెండో దశలో మరో 300 మంది మహిళలకు ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. స్పీకర్‌ను కలిసిన వారిలో శెట్టిపాలెం మాజీ సర్పంచ్‌ అల్లు రామునాయుడు, పలువురు టీడీపీ నాయకులు వున్నారు.

Updated Date - Oct 08 , 2026 | 12:35 AM